ఢిల్లీ వరదలు: ఐటీఓ, సుప్రీంకోర్టును ముంచెత్తిన వరద; ఎన్డీఆర్ఎఫ్ సహాయం కోరిన సీఎం కేజ్రీవాల్
దేశ రాజధాని ఢిల్లీని వరదలు ముంచెత్తుతున్నాయి. యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటి ఢిల్లీని ముంచెత్తుతోంది. యమునా నది ఉదృతంగా ప్రవహించడంతో ఢిల్లీలో రద్దీగా ఉండే ప్రాంతాలు ఐటివో మరియు సుప్రీంకోర్టుతో సహా అనేక ప్రదేశాలలో నీరు చేరింది. వరద నీటితో ఢిల్లీ ఒక నదిని తలపిస్తుంది.
దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ సమయంలో వరదల నుండి కాపాడటం కొస, వరద సహాయం అందించటం కోసం ఆర్మీని రంగంలోకి దింపాలని, లేదా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను పంపాలని కేంద్రాన్ని సహాయం చెయ్యాలని కోరారు. వరదల నుండి ఢిల్లీని కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

యమునా నది శాంతించకపోవడంతో దేశ రాజధాని ఢిల్లీ అంతా జలసంద్రంగా మారింది. సుప్రీం కోర్టు కాంప్లెక్స్ లోకి కూడా వరద నీరు ప్రవేశించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అధికారిక నివాసంతో పాటు సచివాలయం, చారిత్రక కట్టడమైన ఎర్రకోట, రాజ్ ఘాట్ ను కూడా వరద ముంచెత్తింది.
ఢిల్లీలో అనేక కాలనీలు నీట మునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ వరదల దెబ్బకు జనజీవనం అతలాకుతలంగా మారింది. వరదల కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాలలో తాగునీటికి ఇబ్బంది తలెత్తింది.అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కేజ్రీవాల్ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తున్నారు.
వరదలలో చిక్కుకున్న వారికి యుద్ధ ప్రాతిపదికన సహాయం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఐ టి వో బ్యారేజ్ ని సందర్శించే అవకాశం ఉంది. ఢిల్లీలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆర్మీ, ఎన్‌డిఆర్‌ఎఫ్ సహాయం కోరాలని తాను చీఫ్ సెక్రటరీని ఆదేశించానని, అయితే దీనిని తక్షణమే పరిష్కరించాలి అని కేజ్రీవాల్ ఈ మేరకు ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే గురువారం రాత్రి 208.66 మీటర్లు ఉన్న నీటిమట్టం శుక్రవారం ఉదయానికి కాస్త తగినట్టుగా కనిపిస్తుంది. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు 208.46 కు తగ్గినట్టుగా తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు మరింత తగ్గనుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications