Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేజ్రీవాల్ సర్కారు యూటర్న్: సరి-బేసి విధానం నిలిపివేత

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ సర్కారు సరి-బేసి విధానం అమలుపై వెనక్కి తగ్గింది. విపరీతంగా పెరిగిపోయిన కాలుష్య నివారణకు ప్రవేశపెట్టిన సరి-బేసి విధానాన్ని నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం శనివారం పేర్కొంది. ఎన్‌జీటీ షరతుల వల్లే సరి-బేసి అమలు చేయడంలేదని పేర్కొంది.

మహిళలను, టూవీలర్స్‌ను కూడా సరి బేసి విధానం కిందకు తీసుకురావాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) తీర్పుపై సోమవారం మళ్లీ ట్రైబ్యునల్‌ను ఆశ్రయిస్తామని తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ మీడియాతో మాట్లాడారు. మహిళల భద్రత రీత్యా వారిని సరి బేసి విధానం కిందకు తీసుకురావడం సరికాదని అభిప్రాయపడ్డారు.

కాగా, సరి-బేసి విధానంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విధానం అంత సరైనది కాదని చెబుతూనే కొందరికి మినహాయింపు ఎందుకు కల్పించారని ప్రశ్నించింది. ఈ మేరకు శనివారం సుదీర్ఘ విచారణ చేపట్టిన ఎన్‌జీటీ చివరకు సరి-బేసికి ఒప్పుకొంది. అయితే మినహాయింపు అవసరం లేదని.. అందరికీ నిబంధనలు వర్తింపజేయాలని సూచించింది. అత్యవసర వాహనాలకు మాత్రమే మినహాయింపు ఇవ్వాలని సూచించింది.

కాలుష్యం లెవల్‌ 300 దాటితే తప్పనిసరిగా సరి- బేసి విధానం తీసుకురావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్‌ అధ్యక్షతన శనివారం ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటుచేసింది. ఇందులో సరి-బేసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది.

'మహిళలు, ద్విచక్రవాహనాలకు మినహాయింపు ఇవ్వడాన్ని ఎన్‌జీటీ వ్యతిరేకించింది. ప్రస్తుతం మేం సరి-బేసి విధానాన్ని అమలు చేయట్లేదు. ఈ విషయమై సోమవారం నాడు ఎన్‌జీటీలో రివ్యూ పిటిషన్‌ వేస్తాం. ఆ తర్వాత ఎప్పుడు అమలు చేస్తామన్నది ప్రకటిస్తాం' అని కైలాశ్‌ గెహ్లాట్‌ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+