కరోనా బారిన పడి ఆరోగ్య మంత్రి తండ్రి కన్నుమూత: సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రాణాంతక కరోనా వైరస్ ఉధృతికి అద్దం పట్టే ఉదంతం ఇది. ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తండ్రి రామ్ శరణ్ జైన్ కరోనా బారిన కన్నుమూశారు. కొద్దిరోజుల కిందటే ఆయన అనారోగ్యానికి గురి కాగా.. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. పాజిటివ్‌గా తేలింది. దీనితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సంతాపం తెలిపారు.

సత్యేంద్ర జైన్ తండ్రి మరణించిన విషయాన్ని కేజ్రీవాల్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ సమయంలో సత్యేంద్ర జైన్ స్వయంగా కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. సుదీర్ఘకాలం పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. క్వారంటైన్‌లోనూ గడిపారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. కొద్దిరోజుల కిందటే రామ్‌శరణ్ జైన్‌కు కూడా కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. రామ్‌శరణ్ జైన్ మృతి పట్ల పలువురు నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. సత్యేంద్ర జైన్‌ను పరామర్శిస్తున్నారు. ఆయన కుటుంబానికి సానుభూతిని తెలుపుతున్నారు.

Delhi Health Minister Satyendar Jains father died to the Covid19

దేశ రాజధానిలో కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితులు యధాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం నాటి బులెటిన్ ప్రకారం ఢిల్లీలో 412 మంది మరణించారు. 25,219 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొద్దిరోజులుగా వరుసగా 300లకు పైగా మరణాలు ఢిల్లీలో నమోదవుతున్నాయి. ఈ స్థాయిలో కరోనా పేషెంట్లు మృత్యువాత పడటం వరుసగా ఇది పదోరోజు. ఆక్సిజన్ కొరత ఢిల్లీలోని ఆసుపత్రులను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. పలు కార్పొరేట్ ఆసుపత్రులు సైతం ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+