ఆరాధ్య బచ్చన్ పిటీషన్ పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!!
ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల గారాల కుమార్తె ఆరాధ్య బచ్చన్ తనపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యంపై యూట్యూబ్ ఛానల్స్ లో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు విచారణ జరిగింది.
ఆరాధ్య బచ్చన్ పిటిషన్ విషయంలో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.11 సంవత్సరాల ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యం పై వీడియోలు షేర్ చేయకుండా యూట్యూబ్ ఛానల్స్ ను ఢిల్లీ హైకోర్టు ఈ రోజు నిషేధించింది. ఈ క్రమంలో తక్షణమే తమ యూట్యూబ్ చానల్స్ నుండి ఆ వార్తలను తొలగించాలని, భవిష్యత్తులో ఇటువంటి ఫేక్ వార్తలు వ్యాప్తి చేయకూడదని ఆదేశించింది.

ఐశ్వర్య రాయ్ బచ్చన్ వేసిన పిటిషన్ ఆధారంగా గూగుల్ కు, యూట్యూబ్ కు సమన్లు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ల కుమార్తె ఆరాధ్య తీవ్ర అనారోగ్యంతో ఉందని బచ్చన్ కుటుంబ సభ్యులు చిత్రాలను ఉపయోగించి, ఆమె ఆసుపత్రిలో ఉన్నట్టు, మరణించినట్టు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని బచ్చన్ కుటుంబం కోర్టును ఆశ్రయించడంతో కోర్టు సదరు యూట్యూబ్ ఛానల్స్ పై సీరియస్ అయింది.
నిరాధారమైన వార్తలు వ్యాప్తి చేస్తూ, అసత్య వార్తలు ప్రచారం చేస్తూ తన ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారని సదరు యూట్యూబ్ ఛానల్ లను డీ లిస్ట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆరాధ్య బచ్చన్ తన పిటిషన్లో పేర్కొనగా కోర్టు ఈ మేరకు స్పందించింది. తాను మైనర్ నని, తనపై లేనిపోనివి కల్పించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన హక్కులకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారని తన పిటిషన్లో పేర్కొన్న అంశాలతో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కోర్టు సదరు చానల్స్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications