బాబా రాందేవ్ ఎవరి కంట్రోల్ లోనూ లేడు.. ఢిల్లీ హైకోర్టు సీరియస్..!
పతంజలి వ్యవస్థాపకుడు, యోగా గురు బాబా రాందేవ్ పై ఇవాళ ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. గతంలో తాము వద్దన్నా వినకుండా హమ్ దర్ద్ రూహ్ అఫ్జా పానీయాన్ని షర్బత్ జిహాద్ గా పేర్కొంటూ కొత్త ప్రకటన వీడియో విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదంతా చూస్తుంటే రాందేవ్ బాబా ఎవరి నియంత్రణలోనూ లేడని అర్ధమవుతోందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆయనపై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు సిద్ధమైంది.
పతంజలి సంస్థ ఈ మధ్య గులాబ్ షర్బత్ పేరుతో ఓ శీతల పానీయాన్ని విడుదల చేసింది. అయితే దీని ప్రచారంలో రాందేవ్ బాబా దశాబ్దాలుగా మార్కెట్ లో ఉన్న ఇలాంటిదే మరో షర్బత్ హమ్ దర్ద్ వారి రూహ్ అఫ్జాతో పోలుస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తన గులాబ్ షర్బత్ తాగితే దీని వల్ల వచ్చే డబ్బు ఆలయాల నిర్మాణానికి పనికొస్తుందని, అదే రూహ్ అఫ్జా తాగితే ఆ నిధులు తీవ్రవాదులకు చేరతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా దీన్ని షర్బత్ జిహాద్ గా అభివర్ణించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హమ్ దర్జ్ కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు రాందేవ్ పై మండిపడింది.

అయితే గతంలో ఇలా హమ్ దర్జ్ డ్రింక్ రూహ్ అఫ్జాను తాగడాన్ని షర్బత్ జిహాద్ గా రాందేవ్ పేర్కొనడాన్ని ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అయినా ఆయన పట్టించుకోకుండా తాజాగా ఇవే డైలాగ్స్ తో మరో యాడ్ రిలీజ్ చేశారు. దీనిపై ఇవాళ ఢిల్లీ హైకోర్టు మరింత ఘాటుగా స్పందించింది. రాందేవ్ తన సొంత ప్రపంచంలో జీవిస్తున్నాడని, ఆయన ఎవరి నియంత్రణలోనూ లేడని వ్యాఖ్యానించింది.
పతంజలి "గులాబ్ షర్బత్" పై ప్రచారం నేపథ్యంలో రాందేవ్ అభ్యంతరకరమైన ప్రకటనలపై రామ్‌దేవ్ , పతంజలి ఫుడ్స్ లిమిటెడ్‌పై హమ్‌దార్డ్ నేషనల్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరుపుతోంది. ఏప్రిల్ 22న ఢిల్లీ హైకోర్టు రామ్‌దేవ్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆ వ్యాఖ్యలు కోర్టు మనస్సాక్షిని కలవరపరిచాయని పేర్కొంది. ఇవి ఎట్టి పరిస్దితుల్లోనూ సమర్ధించలేనివని తెలిపింది. అయినా రాందేవ్ మళ్లీ ఇవే వ్యాఖ్యలతో యాడ్ రిలీజ్ చేయడంపై కోర్టు ధిక్కార నోటీసు జారీ చేస్తామని తెలిపింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications