ఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. 60 ఏళ్ల వృద్ధుడు తన మనవరాళ్ల వయసుండే ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు, ఆ విషయం ఎవరితోనూ చెప్పవద్దంటూ చెరో 5 రూపాయలు వారి చేతిలో పెట్టాడు.
న్యాయం కోసం వస్తే... మాయమాటలు చెప్పి రేప్ చేసిన పోలీసు అధికారి!
ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని పాలం ప్రాంతానికి చెందిన సదరు వృద్ధుడు తన పొరుగింట్లో ఉండే తొమ్మిదేళ్లు, ఐదేళ్ల వయసున్న ఇద్దరు బాలికలను స్వీట్లు ఇస్తానని నమ్మించి ఇంట్లోకి పిలిచాడు.

అనంతరం వారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ బాలికలు నొప్పితో ఏడుస్తుంటే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ వారికి చెరో రూ.5 ఇచ్చాడు. అయితే ఆ బాలికలిద్దరిలో చిన్నదైన ఐదేళ్ల అమ్మాయి ఏడుస్తూ ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు చెప్పింది.
విషయం వినగానే అవాక్కయిన ఆ బాలిక తల్లిదండ్రులు వెంటనే జరిగిన ఘోరం గురించి మరో బాలిక తల్లిదండ్రులకు కూడా తెలిపారు. అనంతరం వారు వెళ్లి పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి Subscribe to Telugu Oneindia.
ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!