ఢిల్లీ మున్సిపల్ ఫలితాలు: బీజేపీ ఘన విజయం, పోటీ కూడా ఇవ్వని ఆప్, కాంగ్రెస్
ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఢిల్లీ కార్పోరేషన్‌కు ఏప్రిల్ 23న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. మూడు నగర పాలక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుపును నమోదు చేసింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నిజం చేస్తూ వరుసగా మూడోసారి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది.
మొత్తం మూడు కార్పొరేషన్లలోని 270 వార్డులకు ఎన్నికలు జరగగా.. అన్నింటిలో మ్యాజిక్ ఫిగర్‌ను దాటి బీజేపీ జయకేతనం ఎగురవేసింది. బీజేపీ దూకుడుతో అధికార ఆమ్ ఆద్మీకి షాక్ తగిలింది. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం ప్రారంభమైంది.
మొత్తం మూడు కార్పొరేషన్లలోని 270 వార్డులకు ఎన్నికలు జరగగా.. లెక్కింపు మొదలైనప్పటి నుంచీ అత్యధిక స్థానాల్లో బీజేపీ ముందంజలోనే కొనసాగింది. ఎన్నికల ఫలితాల్లో భారీ ఆధిక్యంలో బీజేపీ దూసుకెళ్లగా.. కాంగ్రెస్, అధికార ఆమ్ ఆద్మీ పార్టీలు పోటీ కూడా ఇవ్వలేకపోయాయి.

మూడు కార్పొరేషన్ స్థానాల్లో గెలుపు
బీజేపీ-181
కాంగ్రెస్-31
ఆప్-46
ఇతరులు-12
Counting of votes for Delhi Municipal polls to begin shortly #DelhiMCDElections2017 (Visuals from outside counting centre in RK Puram Sec-3) pic.twitter.com/sZMv1UR5g5
— ANI (@ANI_news) April 26, 2017
ఆప్ కు రెఫరండమంటూ బీజేపీ: ఈవీఎంలదే ప్రభంజనమన్న ఆప్
ఈ ఫలితాలు ఆప్ రెఫరండమని రాష్ట్ర బీజేపీ నేతలు అన్నారు. ఈ విజయం వెనక ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఉన్నారని చెప్పారు. బీజేపీ భారీ విజయం సాధిస్తున్న క్రమంలో ఆ పార్టీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. ఇది ఇలా ఉంటే.. ఆప్ నేతలు మాత్రం ఇది మోడీ ప్రభంజనం కాదు.. ఈవీఎంలదేనని అన్నారు. కాగా, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటాపోటీ ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications