మోడీ ప్రారంభోత్సవానికి రోజుల ముందు: గోడను ఢీకొట్టిన మెట్రో రైలు
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైలు మంగళవారం ఓ గోడను ఢీకొట్టింది. ట్రయల్ రన్ సమయంలో ఇది చోటు చేసుకుంది. ఈ సంఘటన కాళింది కుంజ్ రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకుంది.
Recommended Video

Hyderabad Metro : HYD మెట్రో తరువాతే ఏదయినా ! ఎందుకో తెలుసా ? | Oneindia Telugu
మరికొద్ది రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీ కల్కాజీ మందిర్ - బోటానికల్ గార్డెన్ కారిడార్‌లో ఢిల్లీ మెట్రో లైనును ప్రారంభించాల్సి ఉంది. డిసెంబర్ 25న షెడ్యూల్ ఉంది.

ఇందుకోసం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో మెట్రో రైలు గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రెండు కోచ్‌లు దెబ్బతిన్నాయి.
ఆటోమేటిక్ బ్రేక్‌లు పడకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. కల్కాజీ మందిర్ - బొటానికల్ గార్డెన్‌ను కలుపుతు ఏర్పాటు చేస్తున్న మార్గాన్ని మెజెంతా లైన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రమాదం కారణంగా ప్రస్తుతం ప్రారంభోత్సవంపై అనుమానాలున్నాయి.












Click it and Unblock the Notifications