దేశ రాజధానిలో కాల్పుల కలకలం: పది రౌండ్ల కాల్పులు, ఇద్దరికి గాయాలు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో శనివారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. పశ్చిమ ఢిల్లీలోని సుభాష్ నగర్ ప్రాంతంలో శనివారం 10 రౌండ్లకు పైగా కాల్పులు జరిగాయి, ఇద్దరు గాయపడ్డారు.

Delhi: Over 10 Rounds Of Firing In Subhash Nagar, 2 Injured

వార్తా సంస్థ ఏఎన్ఐ కథనం ప్రకారం.. పోలీసులు, ఉన్నతాధికారులు ప్రస్తుతం సంఘటనా స్థలంలో మోహరించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుభాష్‌ నగర్‌ ప్రాంతంలో శనివారం రాత్రి ఇద్దరు అన్నదమ్ములు కారులో వెళుతుండగా కొందరు తుపాకులతో విరుచుకుపడ్డారు. భారీగా ట్రాఫిక్‌ ఉన్న సమయంలో దాడి చేయగా.. కారులో ఉన్న వారు తప్పించుకునేందుకు వాహనాన్ని ముందుకు నడిపే ప్రయత్నం చేశారు. అయినా వాహనాన్ని వెంబడించి మరీ 10 రౌండ్ల కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ సోదరులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వారి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పుల దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పోలీసులు వీటి ఆధారంగా దుండగులను గుర్తించే పనిలో ఉన్నారు. పాత కక్షలే కాల్పులకు కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు.

క్రాకర్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం: నలుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లోని సొరానా గ్రామంలో లైసెన్స్‌డ్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు మరణించారు.

మంటలను ఆర్పివేశామని, అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని సహరాన్‌పూర్ ఎస్‌ఎస్పీ తెలిపారు. మరోవైపు అగ్ని ప్రమాదంలో నలుగురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఘటనా స్థలానికి చేరుకుని చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించాలని, క్షతగాత్రులకు తగు చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగం అధికారులను సీఎం ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+