న్యాయం కోసం వస్తే... మాయమాటలు చెప్పి రేప్ చేసిన పోలీసు అధికారి!
న్యూఢిల్లీ: వివాహ వివాదంలో తనకు న్యాయం చేయాలంటూ పోలీస్‌స్టేషన్‌కి వచ్చిన ఓ మహిళపై సాక్షాత్తు పోలీసు అధికారి అత్యాచారం చేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.
Recommended Video

ఢిల్లీలోని మియాన్ వాలీ పోలీస్ స్టేషన్ కు ఓ మహిళ(30) వచ్చింది. తన సమస్యను అక్కడ విధుల్లో ఉన్న ఏఎస్ఐ దిలీప్ సింగ్ (50)కు చెప్పింది. ఆందోళన చెందవద్దని, తాను సమస్యను పరిష్కరిస్తానంటూ ఆమెకు భరోసా ఇచ్చాడతను.
స్టేషన్‌లో వద్దు.. బయట మాట్లాడదామంటూ ఏఎస్ఐ దిలీప్ సింగ్ మంగళవారం ఆమెను ఓ ఫ్లాటుకు రప్పించాడు. అనంతరం అదను చూసుకుని ఆమెపై అత్యాచారం జరిపాడు. ఈ దారుణంపై ఆ మహిళ అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ అత్యాచార ఘటనపై ఆ మర్నాడే పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో సదరు మహిళ ఫ్లాట్‌కు వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజిలో కనిపించింది. అంతేకాదు, ఆమెపై అత్యాచారం జరిగినట్లు కూడా వైద్య పరీక్షలో నిరూపితమైంది.
దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఏఎస్సై దిలీప్ సింగ్‌ను గురువారం డిస్మిస్ చేసినట్లు ఢిల్లీ డీసీపీ ఎంఎన్ తివారీ తెలిపారు.












Click it and Unblock the Notifications