హవాలా గుట్టురట్టు: హోటల్ గదిలో రూ. 3.25 కోట్ల పాత నోట్లు సీజ్
దేశ రాజధాని ఢిల్లీ కరోల్‌బాగ్‌లోని హోటల్‌పై ఐటీ శాఖ అధికారులు, క్రైం బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. తనిఖీల్లో హోటల్ గదిలో రూ. 3.25 కోట్ల విలువైన పాత నోట్లు గుర్తించారు.
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కరోల్‌బాగ్‌లోని హోటల్‌పై ఐటీ శాఖ అధికారులు, క్రైం బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో హోటల్ గదిలో రూ. 3.25 కోట్ల విలువైన పాత నోట్లు గుర్తించారు. నగదును సీజ్ చేసిన అధికారులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన సొమ్ము ముంబై హవాలా నిర్వాహకులదిగా భావిస్తున్నారు. ఎయిర్ పోర్ట్ స్కానర్లు కూడా గుర్తించని రీతిలో పాత నోట్లను ప్యాక్ చేశారు. ఎక్స్ రే కిరణాలు కూడా వెళ్లనటువంటి రీతిలో నోట్లకు టేపులు, వైర్లు చుట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఆదాయపన్ను శాఖ అధికారులు పట్టుబడిన వ్యక్తులు ఫోన్ డేటాను పరిశీలిస్తున్నారు. కాగా, నవంబర్ 8న రాత్రి కేంద్ర ప్రభుత్వం 500, వెయ్యి నోట్లను రద్దు చేసిన తర్వాత పెద్ద మొత్తంలో అక్రమ మార్గాల్లో కొత్త, పాత నోట్లు తరలుతున్న డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్న విషయం తెలిసిందే.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications