Delhi Secretarait: ఢిల్లీ సెక్రటేరియట్ సీజ్.. ఫైల్స్, రికార్డులు భద్రపరచాలని ఎల్జీ ఆదేశం
Delhi Secretarait: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని సాధించగలిగింది. అయితే అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన ఆప్.. అవినీతిలో కూరుకుపోయిందని.. ప్రధాని మోడీ దగ్గర నుంచి ఢిల్లీ బీజేపీ నేతల వరకు అంతా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో అధికారంలోకి వస్తే కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతిపై విచారణ జరిపిస్తామని బీజేపీ తేల్చి చెప్పింది. గత పదేళ్లుగా ఆప్ అవినీతిపై బీజేపీ ఆరోపణలు చేసిన సంగతి కూడా తెలిసిందే. బీజేపీ అధికారంలోకి రాగానే అసెంబ్లీలో కాగ్ నివేదికలు ప్రవేశపెడతామని ప్రధాని మోడీ గతంలో చెప్పారు.
ఈ నేపథ్యంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే.. ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా కీలక ఆదేశాలు జారీ చేశారు. సెక్రటేరియట్ లోని ఫైల్స్, రికార్డ్స్ భద్రపరచాలని ఆదేశించారు. ఏ ఒక్క ఫైల్ బయటకు వెళ్లొద్దని ఎల్డీ పేర్కొన్నారు. ఢిల్లీలో విజయం ఖరారు కావడంతో ఆమ్ ఆద్మీ పార్టీపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన సాధారణ పరిపాలన శాఖ తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భద్రతా కారణాలు, రికార్డుల రక్షణ కోసం ఢిల్లీ సెక్రటేరియట్ నుంచి సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) అనుమతి లేకుండా ఒక్క ఫైల్ గానీ, డాక్యుమెంట్ గానీ బయటకు వెళ్లకూడదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సచివాలయాన్ని మూసివేసి అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సచివాలయంలోని కార్యాలయాలకే కాకుండా మంత్రి మండలి క్యాంప్ కార్యాలయాలకు కూడా వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.













Click it and Unblock the Notifications