వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్‌లు చేశా, 30 మందిని చంపా: సీరియల్ కిల్లర్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సీరియల్ కిల్లర్ రవీందర్ కుమార్ చెప్పిన విషయాలు విని పోలీసులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. అత్యాచారాలు చేశానని, ఢిల్లీలోలనూ పరిసరాల్లోనూ 30 మందికిపైగా పిల్లలను చంపానని అతను అంగీకరించాడు. రవీందర్ కుమార్ ఘాతుకాలపై తీవ్ర దిగ్భాంతికి గురైన డిప్యూటీ పోలీసు కమిషనర్ విక్రమ్ సింగ్ మంగళవారంనాడు వివరాలను వెల్లడించారు.

ఆయన చెప్పిన వివరాల ప్రకారం - రవీందర్ కుమార్ 2008 నుంచి 14 లోపు పిల్లలను చంపినట్లు అంగీకరించారు. ఆ విషయాలను విని విక్రమ్ సింగ్ తీవ్రంగా చలించిపోయారు. రవీందర్ కుమార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. అయితే ఢిల్లీలో నివసిస్తున్నాడు.

రవీందర్ కుమార్‌ను పోలీసులు ఢిల్లీ శివారుల్లోని నారెల, బావన, అలిపూర్ ప్రాంతాలకు తీసుకుని వెళ్లారు. దానివల్ల రవీందర్ కుమార్ ఎంతమందిపై అత్యాచారం చేశాడు, ఎంత మందిని హత్య చేశాడనే విషయాలు బయటపడ్డాయి.

Delhi serial rapist confesses to killing over 30 children

రవీందర్ కుమార్ చేతిలో హతమైనవారి సంఖ్య 40 దాకా ఉండవచ్చునని విక్రమ్ సింగ్ చెప్పారు. కేసును దర్యాప్తు చేయడానికి ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సిట్ ఉత్తరప్రదేశ్, హర్యానాలో అతను చేసిన నేరాల గురించి ఆరా తీస్తుంది. కుమార్ చేతిలోని బాధితులు 15 మంది దాకా ఉండవచ్చునని పోలీసులు తొలుత అనుకున్నారు.

అంత మందిని పొట్టన పెట్టుకున కుమార్‌లో కనీసం పశ్చాత్తాపం కూడా కనిపించడం లేదు. పిల్లలను బుజ్జగించి తనతో తీసుకుని వెళ్లేవాడు. వెళ్లడానికి నిరాకరించినవారిని చంపేసి శవాలతో సెక్స్ చేసేవాడు. తాను 17 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు మొదటి నేరం చేసినట్లు కుమార్ అంగీకరించాడని విక్రమ్ సింగ్ చెప్పాడు.

ఢిల్లీలో మెట్రో రైలు నిర్మాణం పనుల్లో కూలీలుగా పనిచేస్తున్న దంపతుల కూతురు అతని చేతిలో మొదటి సారి అత్యాచారానికి, హత్యకు గురైంది. 2009లో ఓ కూలీ కుమారుడిని విజయ విహార్ నుంచి కిడ్నాప్ చేసి గొంతు నులిమి చంపాడు.

English summary
In revelations that have shocked even the police, serial killer Ravinder Kumar has admitted to raping and murdering more than 30 children in and around Delhi, an officer said on Tuesday. Delhi Police has formed a special team to investigate the horrific case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X