Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దిల్లీలో మరోసారి భూకంపం.. ఇళ్ల లోంచి జనాలు పరుగులు

దేశ రాజధాని దిల్లీలో మరోసారి భూకంపం సంభవించింది. 3.7 తీవ్రతతో భూకంపం నమోదైంది. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. హరియాణాలోని జజ్జార్ వద్ద భూకంపం కేంద్రీకృతం అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. దిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్) అంతటా ప్రకంపనలు సంభవించాయని.. శుక్రవారం సాయంత్రం భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలిపింది.

Delhi Shaken Again Earthquake of 3 7 Magnitude Hits National Capital

దేశ రాజధాని దిల్లీని భూకంపం మరోసారి వణికించింది. దిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్) అంతటా శుక్రవారం సాయంత్రం ప్రకంపనలు సంభవించాయి. భూకంపం ధాటికి ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 3.7 తీవ్రతగా భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో హరియాణాలోని జజ్జార్ వద్ద వద్ద కేంద్రీకృతం అయినట్లు తెలిపింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని పేర్కొంది.

దిల్లీలో భూకంపం రావడం వరుసగా ఇది రెండో రోజు కావడం ఆందోళన కలిగిస్తోంది. జులై 10 గురువారం సైతం దేశ రాజధానిలో భూ ప్రకంపనలు సంభవించాయి. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఎన్‌సిఆర్ అంతటా ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైనట్లు పేర్కొంది.

రెండు రోజుల వ్యవధిలోనే ప్రకంపనలు రావడంతో దిల్లీ ప్రజల్లో ఆందోళన మొదలైంది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 17న దిల్లీ ప్రాంతంలో 4.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. జూన్ 8న కూడా 2.3 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+