వ్యాపారి వద్ద లంచం తీసుకున్న మేజిస్ట్రేట్ అరెస్ట్
న్యూఢిల్లీ: ఓ వ్యాపారి నుంచి 25 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఢిల్లీ ప్రత్యేక మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్పీ భాటియాను సిబిఐ అరెస్ట్ చేసింది. ముందస్తు సమాచారం మేరకు మంగళవారం సిబిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ఆర్పీ భాటియాను పట్టుకున్నారు.
ఇటీవల లజపత్ నగర్‌లో తనిఖీల సందర్భంగా ఆర్పీ భాటియా.. షాపు యజమానికి చలానా వేసి కోర్టులో హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. ఈ చలానాను రద్దు చేయాలంటే 60 వేల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

చివరకు 25 వేల రూపాయలు లంచం తీసుకునేందుకు అంగీకరించారు. ఈ విషయం తెలుసుకున్న సిబిఐ మాటువేసి మేజిస్ట్రేట్‌ను అదుపులోకి తీసుకుంది.












Click it and Unblock the Notifications