మరో కొత్త హై స్పీడ్ రైల్ కారిడార్.. ఉత్తర భారదేశంలో రైల్వేకు బూస్ట్!
భారతదేశంలో రైల్వే నెట్వర్క్ గతంలో లేని విధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో దూసుకుపోతుంది. దేశ వ్యాప్తంగా రైల్వే నెట్వర్క్ ను విస్తరించటం, ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు హైస్పీడ్ రైళ్ళను అందుబాటులోకి తీసుకురావటం వంటి చర్యలతో భారత రైల్వే నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.
ఢిల్లీ నుంచి పాట్నా మధ్య కొత్త హై స్పీడ్ రైల్ కారిడార్
ఇప్పటికే దేశంలో అనేక ముఖ్యమైన మార్గాల్లో హైస్పీడ్ రైల్ కారిడార్ లను అందుబాటులోకి తీసుకు వస్తున్న రైల్వే తాజాగా మరో కొత్త హై స్పీడ్ రైల్ కారిడార్ కు రెడీ అవుతోంది.దేశ రాజధాని ఢిల్లీ నుంచి బిహార్ రాజధాని పాట్నా మధ్య కొత్త హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టును కేంద్ర రైల్వే శాఖ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ తర్వాత ఇది మరో ప్రధాన కారిడార్‌గా నిలవనుంది.

1,170 కిలోమీటర్ల దూరం కేవలం 4 గంటల 30 నిమిషాల్లో
సుమారు 1,170 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 4 గంటల 30 నిమిషాల్లో కవర్ చేసేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ లేదా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ దూరం చేరుకోవడానికి సగం రోజు పైగా సమయం పడుతోంది. కొత్త బుల్లెట్ ట్రైన్ వచ్చిన తర్వాత ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గి, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.
ఉత్తర భారత్‌లో రవాణా వ్యవస్థను బలోపేతం చేసే ప్రాజెక్ట్
ఈ మార్గం ఆగ్రా, కాన్పూర్, లక్నో, ప్రయాగ్‌రాజ్, వారణాసి మీదుగా సాగుతుంది. చారిత్రక, ఆధ్యాత్మిక, పారిశ్రామిక నగరాలను కలిపే ఈ కారిడార్ ఉత్తర భారత్‌లో రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తుంది. పండుగల సమయంలో ఢిల్లీ-పాట్నా మార్గంలో తీవ్ర రద్దీ ఉంటుంది. దసరా, దీపావళి, ఛట్ వంటి పండుగల్లో బెర్తులు దొరకక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
డీపీఆర్ పూర్తయి, భూసేకరణ జరిగిన తర్వాత నిర్మాణం
ఈ మార్గంలో బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఉత్తరప్రదేశ్, బిహార్ నుంచి ఢిల్లీలో ఉపాధి కోసం ఉన్న లక్షలాది మందికి ఇది పెద్ద ఉపశమనం. ప్రస్తుతం ప్రాజెక్టు ప్రాథమిక సర్వే, అలైన్మెంట్, ఫీజిబిలిటీ స్టడీ దశలో ఉంది. డీపీఆర్ పూర్తయి, భూసేకరణ జరిగిన తర్వాత నిర్మాణం ప్రారంభమవుతుంది. ఆధునిక ట్రాక్, సిగ్నలింగ్, భద్రతా వ్యవస్థలతో ఈ హైస్పీడ్ రూట్ రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రాజెక్ట్ ఉత్తర భారత్‌లో రవాణా, పర్యాటకం, ఆర్థిక రంగాలపై సానుకూల ప్రభావాన్ని చూపనుంది.












Click it and Unblock the Notifications