బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం: ఏపీలో వర్షాలు

Fengal Cyclone: కొద్దిరోజుల కిందటే బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. వరదలు సంభవించాయి. ఏపీ దక్షిణ ప్రాంతం, రాయలసీమ జిల్లాలతో పాటు పొరుగునే ఉన్న తమిళనాడు, కర్ణాటకల్లో అంచనాలకు మించిన వర్షపాతం నమోదైంది.

ఇప్పుడు మళ్లీ అవే తరహా పరిస్థితులు తలెత్తనున్నాయి. హిందూ మహా సముద్రంలో తాజాగా తుఫాన్ ఏర్పడటమే దీనికి కారణం. ఇక్కడ ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. వాయుగుండంగా రూపుదాల్చింద. ఈ సాయంత్రం నాటికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఫలితంగా తమిళనాడు, పుదుచ్చేరిల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి.

Depression over Bay of Bengal and Indian Ocean bringing very heavy rainfall in Tamil Nadu

ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో తుఫాన్‌గా మారడానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి ఇదివరకే ఫెంగల్ అని పేరు పెట్టింది. ఈ పేరును- సౌదీ అరేబియా సూచించింది. ఈ సీజన్‌లో సంభవించబోతోన్న మూడో తుఫాన్ ఇది.

సోమవారం రాత్రి నాటికి దక్షిణ బంగాళాఖాతం- తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగంలో స్థిరంగా కనిపించిందీ వాయుగుండం. శ్రీలంకలోని ట్రింకోమలికి ఆగ్నేయ దిశగా 600, తమిళనాడులోని నాగపట్నానికి ఆగ్నేయం- తూర్పు ఆగ్నేయ దిశగా 880, పుదుచ్చేరికి ఆగ్నేయ దిశగా 980, చెన్నైకి 1,050 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.

క్రమంగా ఇది ఆగ్నేయ దిశగా కదులుతుందని, ఈ సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తుఫాన్ ప్రభావంతో వచ్చే ఈ నెల 29వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరిలతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడొచ్చు.

ప్రత్యేకించి ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ని ఐఎండీ పేర్కొంది. ఏపీ దక్షిణ కోస్తా తీరం వెంబడి నేడు, రేపు 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. 29వ తేదీ వరకు మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని సూచించింది. ఇప్పటికే సముద్రంపై ఉణ్న వాళ్లు వెంటనే తిరిగి రావాలని హెచ్చరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+