వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: జీఎస్టీ పేరుతో పట్టపగలే, పన్ను తగ్గినా.. సామాన్యుడికి తిప్పలు తగ్గలే!

దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానమంటూ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)తో పట్ట పగలే నిలువు దోపిడీ జరుగుతోంది. చాలాచోట్ల ఆయా సంస్థలు జీఎస్టీ పేరుతో వినియోగదారులను దోచుకుంటున్న

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానమంటూ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)తో పట్ట పగలే నిలువు దోపిడీ జరుగుతోంది. చాలాచోట్ల ఆయా సంస్థలు జీఎస్టీ పేరుతో వినియోగదారులను దోచుకుంటున్నాయి.

ఇందుకు ఉదాహరణ.. మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ అయిన ప్రతాప్ బోస్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్. ఈ పోస్టింగ్ తో జీఎస్టీ పేరుతో జరుగుతున్న దోపిడీ వెలుగులోకి వచ్చింది.

Despite GST Cut, McDonald’s Bills Remain The Same & Twitter Is Not Impressed

ఇటీవల జీఎస్టీ పన్ను శాతాన్ని 18 నుంచి 5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. అయినా సరే, ఓ రెస్టారెంట్ బిల్లులో ఏమాత్రం మార్పు రాలేదని ప్రతాప్ బోస్ గుర్తించారు. 'జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించారు. కానీ బిల్లులో మాత్రం ఏ తేడా లేదు. పట్ట పగలే దోచుకుంటున్నారని' బిల్లుకు సంబంధించిన ఫొటోను అటాచ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు.

మెక్‌డోనాల్డ్స్, అరుణ్ జైట్లీ పేర్లను ట్యాగ్ చేస్తూ జరుగుతున్న మోసాన్ని ప్రతాప్ బోస్ వారి దృష్టికి తీసుళ్లారు. జీఎస్టీ 18 శాతం ఉన్న నవంబర్ 7న, జీఎస్టీ 5 శాతానికి తగ్గిన తర్వాత నవంబర్ 15న కూడా బిల్లు రూ.142 కావడం గమనార్హం.

English summary
After Finance Minister Arun Jaitley announced that GST rates on restaurants are going to be slashed down, consumers everywhere had breathed a sigh of relief. However, it turns out food chains like McDonald's and Starbucks have tweaked their prices in a manner that the total bill is still remaining the same.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X