హతమారుస్తాం: మహారాష్ట్ర సీఎంకు మావోయిస్టుల బెదిరింపు లేఖ

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, ఆయన కుటుంబసభ్యులను హతమారుస్తామని ఏకంగా సీఎం కార్యాలయానికే మావోయిస్టులు బెదిరింపు లేఖ పంపించారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో 40 మంది మావోయిస్టులు మృత్యువాత పడిన ఘటనను ఈ లేఖలో మావోయిస్టులు ప్రస్తావించారు.

కొద్దిమంది కామ్రేడ్లను నిర్మూలించడంతో విప్లవం ఆగదని లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. సీఎం కార్యాలయానికి బెదిరింపు లేఖ అందడంతో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు పోలీసులు తెలిపారు. బెదిరింపు లేఖపై అధికారులు, భద్రతాదళాలు విచారణ జరుపుతున్నాయని తెలిపారు.

Devendra Fadnavis gets threat letters over anti-Maoist operations

మరోవైపు ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ గడ్చిరోలి జిల్లా భంరగ తాలూకాలో కరపత్రాలు, బ్యానర్లు వెలిశాయి. అత్యున్నత స్థాయి వ్యక్తులకు బెదిరింపు లేఖ రావడం ఒకేరోజులో ఇది రెండవది కావడం గమనార్హం.

రాజీవ్‌గాంధీని హతమార్చిన తీరులో ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్రపన్నినట్టు ఈ మేరకు మావోయిస్టులు ప్రణాళిక రూపొందించారని పుణే పోలీసులు వెల్లడించారు. అందుకు సంబంధించిన లేఖను వారు విడుదల చేశారు.మావోయిస్టులు గత ఏడాది ఏప్రిల్‌లో ఆ లేఖను రాసినట్టు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+