Sabarimala : శబరిమల మండల పూజకు భారీగా తగ్గిన భక్తులు ... ఆలయం వద్ద కరోనా నియమాలు
కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, అయ్యప్ప స్వామి కొలువుతీరిన క్షేత్రమైన శబరిమల క్షేత్రాన్ని దర్శించడం కోసం భక్తులు వెళుతున్నారు. శబరిమలలో వార్షిక మండల, మకర విళక్కు పూజల కోసం రెండు నెలలపాటు ఆలయాన్ని తెరచిన నేపథ్యంలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. అయితే గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆన్ లైన్ లో దర్శనం స్లాట్ బుక్ చేసుకోవడం, కరోనా నెగిటివ్ సర్టిఫికెట్లు తీసుకొని వెళ్ళడం, ఆలయం వద్ద కరోనా నియమాలు పాటించడం వంటి కారణాల నేపథ్యంలో చాలా మంది భక్తులు ఈసారి శబరిమల యాత్రకు వెళ్ళని పరిస్థితి నెలకొంది.
మండల పూజల కోసం భక్తులు అయ్యప్ప స్వామి ఆలయ సన్నిధానం వద్దకు చేరుకున్నారు. భక్తులు సామాజిక దూరాన్ని పాటించేలా అక్కడ ఉన్న వాలంటీర్లు తగిన చర్యలు తీసుకుంటున్నారు. మాస్క్ లను ధరించటం తప్పని సరి కావడంతో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ స్వామి దర్శనం చేసుకుంటున్నారు. అధికార యంత్రాంగం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.

కరోనా వైరస్ కేరళలో పంజా విసురుతుంది . కరోనావైరస్ పరిమితుల కారణంగా ఆలయ ప్రాంగణంలో మునుపటి సంవత్సరాలతో పోలిస్తే తక్కువ భక్తులు వచ్చినట్టుగా అధికారిక అంచనా . మహమ్మారి ప్రారంభంలో ఆలయాలు ఏడు నెలల మూసివేత తరువాత, అక్టోబర్ 16 నుండి భక్తుల కోసం శబరిమల ఆలయాన్ని తెరిచారు .
అప్పటి నుండి కఠినమైన కోవిడ్ నియమాలతో భక్తులకు స్వామి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications