నరేంద్ర మోడీ కోసం షాజహాన్ ఉర్సులో భక్తుల ప్రార్థనలు
ఢిల్లీ/ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని తాజ్‌మహల్‌లోని షాజహాన్, ముంతాజ్‌మహల్‌ల సమాధుల వద్ద 369వ ఉర్సు ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడి చేరుకున్నారు.
ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోడీ గురించి, దేశ శాంతి సౌభాగ్యాల గురించి ప్రార్థనలు చేసినట్లు పలువురు భక్తులు తెలిపారు. మత సామరస్యానికి ప్రతీక నిలిచే భారత సంస్కృతిని ప్రతిబింబిస్తూ మోడీ పాలన కొనసాగాలని, ఆయన పాలనలో దేశంలోని అన్ని ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేసినట్లు భక్తులు చెప్పారు.

రైలు ప్రమాద బాధితులకు మోడీ సంతాపం
ఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రైలు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు సత్వర, మెరుగైన వైద్య సాయం అందించే ఏర్పాట్లు చేయాలని కేబినెట్ సెక్రటరీకి మోడీ ఆదేశాలు జారీ చేశారు.
రైలు ప్రమాద ఘటన పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications