దేశవ్యాప్తంగా ఎడా పెడా ఇన్ స్టా పోస్టుల బ్లాక్..! ధృవ్ రాఠీ ఫైర్..!
దేశంలో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాపై అప్రకటిత ఆంక్షలు అమలవుతున్నాయి. ఎన్నికల కమిషన్ వివాదం నేపథ్యంలో సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్ స్టాలో కనిపిస్తున్న పోస్టుల్ని ఇష్టారాజ్యంగా బ్లాక్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే ఇలా ఆయా ప్లాట్ ఫామ్ లు ఇష్టం వచ్చినట్లుగా ఇన్ స్టా పోస్టుల్ని బ్లాక్ చేస్తున్నాయని యూజర్లు మండిపడుతున్నారు. తాజాగా కోర్టుల వార్తల్ని ప్రచురించే లైవ్ లా వెబ్ సైట్ కు చెందిన ఇన్ స్టా పేజ్ లో పోస్టు చేసిన ఈసీ విధుల పోస్టును కూడా తొలగించారు.
దీంతో మీడియాపై కూడా ఆంక్షలు విధిస్తున్నట్లు అర్దమవుతోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీతో పాటు యూట్యూబర్ ధృవ్ రాఠీ (Dhruv Rathee) స్పందించారు. కాక్రోచ్ పార్టీ నేతల వాట్సాప్ అకౌంట్లు కూడా బ్లాక్ అవుతున్నాయని, మెసేజ్ లు పంపకుండా అడ్డుకుంటున్నారని సీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో లైవ్ లా లీగల్ వార్తల ఇన్ స్టా గ్రామ్ పేజిలో పెట్టిన ఓ రీల్ ను బ్లాక్ చేయడంపై సదరు వెబ్ సైట్ ఎక్స్ లో పెట్టిన ఓ పోస్టును ధృవ్ రాఠీ షేర్ చేశారు.

ఇందులో లైవ్ లా వెబ్ సైట్.. సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన అఫిడవిట్‌కు సంబంధించి 'లైవ్‌లా' అధికారిక పేజీలో పోస్ట్ చేసిన రీల్‌ను ఇన్స్టాగ్రామ్ తొలగించిందని తెలిపింది. ఈసీఐ వెర్షన్‌ను కేవలం వివరించే ఉద్దేశంతో ఉన్న ఈ రీల్‌ను, ఈ కంటెంట్‌పై ఆంక్షలు విధించాలని తమకు చట్టపరమైన అభ్యర్థన అందిందంటూ ఇన్ స్టా పంపిన మెసేజ్ ను లైవ్ లా పోస్టు చేసింది. ఈ రీల్ ఏ చట్టాన్ని ఉల్లంఘించిందో ఎటువంటి వివరణ ఇవ్వలేదని పేర్కొంది. అదే వీడియో యూట్యూబ్‌లో అందుబాటులో ఉందని కూడా వెల్లడించింది. దీనిపై ధృవ్ రాఠీ మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం ఇన్‌స్టాగ్రామ్‌కు మూకుమ్మడిగా సస్పెన్షన్ ఉత్తర్వులు ఇస్తోందనడానికి ఇదే నిదర్శనం అన్నారు. వారు ఒక్కో పోస్ట్‌ను తనిఖీ చేయడాన్ని కూడా పట్టించుకోకుండా, గుడ్డిగా పోస్టులను మూకుమ్మడిగా బ్లాక్ చేస్తున్నారని ధృవ్ రాఠీ విమర్శించారు.














Click it and Unblock the Notifications
