SIR కు వ్యతిరేకంగా రేపు బెంగళూరులో Chappal protest.. చీఫ్ గెస్ట్ గా ధ్రువ్ రాఠే
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కు వ్యతిరేకంగా అక్టోబర్ 8 న బెంగళూరులో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. అలాగే ఓటర్ లిస్టు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భారీ అవకతవకలు.. చాలామంది కన్నడిగుల పేర్లను అన్యాయంగా ఓటర్ల లిస్ట్ నుంచి తొలగించారని ఆరోపిస్తూ బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ లో చెప్పుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టనుంది.
చెప్పుల నిరసనతో పాటు నిరసనల్లో భాగంగా ప్రజా ట్రిబ్యునల్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు సీజేపీ సహ కన్వీనర్ అశుతోష్ రాంకా తెలిపారు. ఇక ఈ నిరసన కార్యక్రమానికి బెంగళూరులోని కాక్రోచ్ లు అందరూ రావాలని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈ ఆందోళనకు తన పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ ఆందోళనల్లో పాల్గొనేందుకు ప్రముఖ యూట్యూబర్, పొలిటికల్ కామెంటేటర్ ధ్రువ్ రాఠే చీఫ్ గెస్ట్ గా వస్తున్నారని ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా తమ వైఖరిని తెలియజేయాలని కోరారు.

"అందరికీ నమస్కారం.. మార్నింగ్ చెప్పిన వీడియోలో ఈ నిరసనలో పాల్గొనే వెరీ స్పెషల్ గెస్ట్ ను ప్రకటిస్తామని తెలిపాం. అక్టోబర్ 8న బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ లో నిర్వహించే నిరసన కార్యక్రమంలో ప్రముఖ యూట్యూబర్, పొలిటికల్ కామెంటేటర్ ధ్రువ్ రాఠే పాల్గొననున్నారు. ధ్రువ్ రాఠే ఫస్ట్ టైమ్ బెంగళూరులో ఇలాంటి కార్యక్రమంలో హాజరుకానున్నారు. స్క్రాప్ ఎస్ఐఆర్ కు మద్దతుగా ఆయన నిరసనలో పాల్గొంటారు. ప్లీజ్.. మీరు పెద్ద సంఖ్యలో రావాలి. అక్కడ ఉన్న అందరు కాక్రోచ్ లకు అండగా ఉండాలి. ఐషే గోష్ , నేహా బోరా రానున్నారు. అన్ని యంగ్ ఆర్గనైజేషన్స్ కూడా అక్కడకు రానున్నాయి. సివిల్ సొసైటీ సభ్యులు రానున్నారు. అలాగే కర్ణాటక వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఎస్ఐఆర్ బాధితులు హాజరుకానున్నారు. ఇలా అందరం సమిస్టిగా డ్రాకోనియన్ ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం.." అని ప్రకాశ్ రాజ్ తన అధికారిక ఎక్స్ మాధ్యమంలో ఓ వీడియో ద్వారా పోస్టు చేశారు.
Dhruv rathee with us in Bengaluru freedom park tomorrow.. 💪💪💪 https://t.co/9W4Jyj8uGw
— Prakash Raj (@prakashraaj) October 7, 2026
ఇక కాక్రోచ్ జనతా పార్టీ తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ లో అక్టోబర్ 8 ఉదయం 10 గంటల 30 నిమిషాలకు చెప్పుల నిరసన కార్యక్రమం, ప్రజా ట్రిబ్యునల్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.












Click it and Unblock the Notifications
