భారత్ ఆక్రమించిన కాశ్మీర్!: మోడీని తిట్టేందుకు నోరు జారిన డిగ్గీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గురువారం నాడు కాశ్మీర్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతను కాశ్మీర్‌ను.. 'భారత్ ఆక్రమించిన కాశ్మీర్' అని పేర్కొన్నారు. ఆయన ప్రధాని నరేంద్ర మోడీ పైన విరుచుకు పడ్డారు.
మోడీని విమర్శించాలన్న తొందరలో ఆయన తప్పులో కాలేశారు. ఆ సమయంలోనే కాశ్మీర్ అంశంపై వివాదాస్పదం వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి ఎక్కువగా పట్టించుకుంటున్నారని, దానిని స్వాగతించాల్సిందే కానీ, భారతీయ కాశ్మీరీలతో చర్చలు జరపడంలో ఆసక్తి చూపించడం లేదన్నారు.
కాశ్మీరీలలో నమ్మకాన్ని పొందినట్లు ఆయన చెబుతున్నారని, అయితే వాళ్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు చెందిన వాళ్లయినా లేక భారత ఆక్రమిత కాశ్మీర్‌కు చెందిన వాళ్లయినా చర్చల ద్వారానే అది సాధ్యమన్నారు.

అయితే, ఆ తర్వాత డిగ్గీ నాలుక్కర్చుకున్నారు. భారత దేశ కాశ్మీర్ గురించి మోడీ పట్టించుకోవడం లేదని చెప్పదలుచుకున్నట్లు చెప్పారు. ఆయన లోయ గురించి పట్టించుకోకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి పట్టించుకుంటున్నారని మండిపడ్డారు.
డిగ్గీ వ్యాఖ్యల పైన తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. సోషల్ మీడియాలో ఆయన పైన మండిపడుతున్నారు. డిగ్గీ భారత ఆక్రమిత కాశ్మీర్ అంటున్నారని, ఇది ఆయన పాకిస్తానీ సోదరీమణులకు రాఖీ బహుమతి అని బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications