దినకరన్ కు కారు కాదుకదా బైక్ కూడా లేదంట: విద్యార్హత ఇదే !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీకి దిగన టీటీవీ దినకరన్ తన ఆస్తుల వివరాలను ఎన్నికల కమిషన్ కు సమర్పించారు. దినకరన్ తన విద్యార్హత ప్లస్ టూ (ఇంటర్)గా పేర్కొన్నారు. తనకు కారు కాదుకదా కనీసం ద్విచక్ర వాహనం కూడా లేదని తన నామినేషన్ అఫిడివిట్ లో పేర్కొన్నారు.

అయితే తన భార్య అనురాధకు రూ. 13. 88 లక్షల విలువైన టాటా సఫారీ కారు ఉందని దినకరన్ అంగీకరించారు. 2015-16లో దినకరన్ తన ఆదాయం రూ. 2.22 లక్షలు చూపించారు. చరాస్తులు రూ. 11.45 లక్షలు, స్థిరాస్తులు రూ. 57.44 లక్షలు చూపించారు. రుణాలు మాత్రం ఏమీ లేవని వివరించారు.

Dinakaran's hat symbol is not getting good response in the RK Nagar.

దినకరన్ భార్య అనురాధా పేరుతో 2015-16లో ఆదాయం రూ. 71.63 లక్షలు, చరాస్తులు రూ. 7.19 కోట్లు, స్థిరాస్తులు రూ. 2.40 కోట్లు, రుణాలు రూ. 5.40 కోట్లు చూపించారు. మొత్తం మీద దినకరన్ కంటే ఆయన భార్యకే ఆదాయం, ఆస్తులు ఎక్కువ ఉన్నాయని చూపించారు.

ఇక అన్నాడీఎంకే పార్టీ, అమ్మ పేరు ప్రతిష్టలను ఓట్లుగా మలుచుకోవాలని ప్రయత్నిస్తున్న దినకరన్ కు ఆర్ కే నగర్ లో ఊహించలేని ఎదురుగాలి వీస్తోంది. ఎన్నికల కమిషన్ దినకరన్ కు కేటాయించిన టోపీ గుర్తును ఆర్ కే నగర్ నియోజక వర్గం ప్రజలు పట్టించుకొకపోవడంతో ఆయన వర్గీయులు కంగుతిన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TTV. Dinakaran's hat symbol is not getting good response in the RK Nagar. Will he win the by poll?
Please Wait while comments are loading...