విద్వేషపూరిత అభియోగాలు: రిపబ్లిక్ టీవీ జర్నలిస్టు బృందంపై ఎఫ్ఐఆర్ నమోదు
ముంబై: రిపబ్లిక్ టీవీ న్యూస్ ఛానల్‌కు చెందిన నలుగురు జర్నలిస్టులు, ఇతర ఎడిటోరియల్ సిబ్బందిపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమ ప్రతిష్టతకు భంగం కలిగించడంతోపాటు పోలీసులు మధ్య అసమ్మతి రగిలించేందుకు ప్రయత్నించారంటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
రిపబ్లిక్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ నిరంజన్ నారాయణస్వామి, డిప్యూటీ ఎడిటర్ శావన్ సేన్, యాంకర్ శివానీ గుప్తా, డిప్యూటీ న్యూస్ ఎడిటర్ సాగరిక మిత్రా, న్యూస్ రూమ్ ఇంఛార్జ్, ఇతర ఎడిటోరియల్ సిబ్బందిపై ఈ కేసులు నమోదు చేశారు.

కాగా, మహారాష్ట్రలో మీడియా స్వేచ్ఛపై దాడి దాడి జరుగుతోందని, దీనిపై శాయశక్తులా పోరాడతామని రిపబ్లిక్ టీవీ యాజమాన్యం స్పష్టం చేసింది. ముంబై నగర్ కమిషనర్‌పై సీనియర్ అధికారుల తిరుగుబాటు చేశారంటూ రిపబ్లిక్ టీవీ ప్రసారం చేసిన ఓ కథనానికి సంబంధించి ముంబైలోని ఎన్ఎం జోషి మార్గ్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదు చేశారు.
స్పెషల్ బ్రాంచ్ సబ్ ఇన్‌స్పెక్టర్ శశిశకాంత్ పవార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రిపబ్లిక్ టీవీ బృందంపై ఈ కేసులు నమోదు చేశారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ అనుమానాస్పద మృతిపై రిపబ్లిక్ టీవీ అనేక కథనాలు ప్రసారం చేసిన విషయం తెలిసిందే. సుశాంత్ ది హత్యేనని, పోలీసులు, ప్రభుత్వం సరైన రీతిలో దర్యాప్తు చేయడం లేదనే రీతిలో కథనాలను ప్రసారం చేసింది.
Recommended Video
ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్.. సుశాంత్ మృతితోపాటు పలు విషయాలపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన ముంబైలోని భవనాన్ని విధ్వంసం చేసింది ముంబై నగరపాలక సంస్థ. ఈ క్రమంలో ఆమెకు మద్దతుగా కూడా రిపబ్లిక్ టీవీ కథనాలు ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలోనే తమపై మహారాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని రిపబ్లిక్ టీవీ యాజమాన్యం ఆరోపిస్తోంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications