దసరాకు మిస్ అయింది గానీ.. దీపావళికి కేంద్రం నుంచి ధమాకా గిఫ్ట్ గ్యారంటీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇదివరకు PM-Kisan పథకంలో భాగంగా 20వ విడత నిధులను విడుదల చేశారు. ఈ విడత ద్వారా 9.7 కోట్లకు పైగా అర్హులైన రైతులకు రూ. 20,500 కోట్లు జమ అయ్యాయి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కొనసాగుతున్నందున.. ఈ ఆర్థిక సహాయం దేశవ్యాప్తంగా రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ ఇన్ పుట్ కొనుగోలు వంటి అవసరమైన ఖర్చుల కోసం ఈ మొత్తం దోహదపడుతుంది.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-కిసాన్) అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. దేశవ్యాప్తంగా భూమి ఉన్న రైతులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీనిని 2019 ఫిబ్రవరిలో ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున మూడు వాయిదాల్లో ఈ మొత్తం జమ అవుతుంది. ఒక్కో విడతకు 2,000 రూపాయల చొప్పున మొత్తాన్ని విడుదల చేస్తారు.

Diwali Surprise PM Kisan 21st Installment Set for Release

ఈ మొత్తం DBT ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ అవుతుంది. తద్వారా పారదర్శకత పెరుగుతుంది, మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. ఈ పథకం కింద ప్రయోజనాలను పొందడానికి రైతులకు కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. రైతులు సాగు చేయదగిన భూమిని కలిగి ఉండాలి. ఈ-కేవైసిని పూర్తి చేయాలి. వారి ఆధార్‌ నంబర్ ను బ్యాంకు ఖాతాతో అనుసంధానించి ఉండాలి. భూ రికార్డులు అప్ డేట్ అయివుండాలి.

ఇక 21వ విడత పీఎం కిసాన్ నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో విడుద చేయనున్నారు. దీపావళి పండగను పురస్కరించుకుని అక్టోబర్ మూడో వారంలో ఈ నిధులను అర్హులైన లబ్దిదారుల అకౌంట్లలో జమ కానున్నాయి. నవరాత్రి- దీపావళి పండగలను పురస్కరించుకుని రైతులకు ఈ నిధులు అందే అవకాశం ఉంది. ఒక్కొక్కరి ఖాతాలో రూ. 2,000 జమ అవుతాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలో అధికారిక ప్రకటన చేయనుంది.

ఈ-కేవైసీ పూర్తి చేయని రైతుల ఖాతాలకు నిధులు నిలిచిపోయే అవకాశం ఉంది. రైతులు తమ బెనిఫిషియరీ స్టేటస్‌ను అధికారిక పోర్టల్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ పథకంలో భాగంగా సంవత్సరానికి రూ. 6,000 చొప్పున మూడు వాయిదాలలో అందిస్తారు. 2019లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా సుమారు 10 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం రైతులకు రూ. 3.69 లక్షల కోట్లను పంపిణీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+