ఐటీ దాడుల వెనుక ఎవరున్నారో తెలుసు, మీకు తెలీదా, అంతేగా అంతేగా, డీకే !
బెంగళూరు: ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం కర్ణాటక నుంచి డబ్బులు పంపిస్తున్నారని కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అశ్వత్ నారాయణ చేసిన ఆరోపణపై కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ (dk shivakumar) ఘాటుగా స్పందించారు. శుక్రవారం బెంగళూరులోని సదాశివనగర్‌లో డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. దారినపోయే దానయ్యల కామెంట్స్ కు తాను స్పందిచను అని డీకే శివకుమార్ అన్నారు.
బెంగళూరులో (Bengaluru) జరిగిన ఐటీ దాడుల వెనుక రాజకీయం ఉందా అన్న మీడియా ప్రశ్నకు డీకే శివకుమార్ మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశం లేకుండా దేశంలో ఐటీ దాడులు (it raids) జరగవని ఆయన ఆరోపించారు. రాజకీయ ప్రేరేపిత ఐటీ దాడులు (it raids) కర్ణాటకలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (dk shivakumar)అన్నారు.

బీబీఎంపీ విడుదల చేసిన రూ 650 కోట్ల గ్రాంట్‌లో వచ్చిన కమీషన్ సొమ్మును అంబికాపతి ద్వారా పంపిస్తున్నారనే ఆరోపణలపై డీకే శివకుమార్ (dk shivakumar)మాట్లాడుతూ ఈ విషయం తనకు తెలియదన్నారు. కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు కెంపన్న మాట్లాడుతూ రైతుల కంటే మా పరిస్థితి దారుణంగా ఉందని చేసిన ఆరోపణలపై తనకు సమాచారం లేదని డీకే శివకుమార్ (dk shivakumar) అన్నారు.

విచారణను పక్కనబెట్టి బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరడంపై మీడియా అడిగిన ప్రశ్నకు డీకే శివకుమార్ (dk shivakumar) స్పందిస్తూ పెండింగ్ బిల్లుల చెల్లింపుపై కెంపన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మీకు ఏదైనా సమస్య ఉంటే వచ్చి మాతో మాట్లాడండి, మేము మీకు న్యాయం చేస్తామని డీకే శివకుమార్ (dk shivakumar) అన్నారు. కెంపన్న అభ్యర్థన మేరకు విచారణను పక్కన పెట్టి 60-70% పనులను ప్రాధాన్యతా ప్రాతిపదికన విడుదల చేశామని డీకే శివకుమార్ అన్నారు.
పెండింగ్ బిల్లు చెల్లింపు సమయంలో జీఎస్టీ (GST) కూడా చెల్లించాలి కాబట్టి ఇన్వెస్టిగేషన్ రిపోర్టు రాకముందే మూడొంతుల డబ్బు విడుదల చేశామని, కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు కెంపన్న మంత్రిపైన ఆరోపణలు చేయడం లేదని, అధికారుల మీద మాత్రమే ఆరోపణలు చేస్తున్నారని డీకే శివకుమార్ అన్నారు. అయితే ఏ అధికారుల మీద కెంపణ్ణ ఏ అధికారుల మీద ఆరోపణలు చేశారు అనే దీనిపై మాకు సమాచారం లేదని, దీనిపై సరైన విచారణ జరిపే వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని డీకే శివకుమార్ (dk shivakumar)చెప్పారు.

లోడ్ షెడ్డింగ్‌పై మీడియా అడిగిన ప్రశ్నకు డీకే శివకుమార్ (dk shivakumar) సమాధానమిస్తూ ఈ అంశంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య సమావేశం ఏర్పాటు చేశారని, కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి ఎంత చేసింది, అ పెరిగిందో, బీజేపీ (BJP) హయాంలో ఎంత శాతం విద్యుత్ ఉత్పత్తి పెరిగిందో నా దగ్గర సమాచారం ఉంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో సమావేశం పూర్తి అయిన తర్వాత తానున మాట్లాడతానని డీకే శివకుమార్ చెప్పారు.












Click it and Unblock the Notifications