• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కష్టం మాది.. పదవులు వారికా?: డీకె అసంతృప్తి, తన జోక్యం లేదన్న దేవెగౌడ

|

బెంగళూరు: కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో తనకు డిప్యూటీ సీఎం పదవి దక్కకపోవడంపై కాంగ్రెస్ కీలక నేత డీకె శివకుమార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తొలి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నా.. పదవుల విషయంలో మాత్రం పార్టీ తనను దూరం పెడుతుండటం ఆయనకు మింగుడుపడటం లేదు.

బీజేపీ ప్రలోభాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడింది తానైతే.. పదవులు మాత్రం మరొకరికా? అంటూ పరోక్షంగా డిప్యూటీ సీఎం పరమేశ్వరపై ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కష్టం మాది.. పదవులు వారికా?

కష్టం మాది.. పదవులు వారికా?

'ఎమ్మెల్యేలు వెళ్ళిపోకుండా చూసుకోవాలంటే మేం కావాలి... గుజరాత్‌ నుంచి రక్షణకోసం ఎమ్మెల్యేలు వస్తే మేం కాపాడాలి... కష్టం మాది.. పదవులు వారికా?' అంటూ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ వేణుగోపాల్‌ సహా పలువురు కీలక నాయకుల సమక్షంలో డీకె ఫైర్ అయ్యారు.

బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడిన డీకె.. పార్టీ పట్ల విధేయుడిగా ఎంతో సేవ చేస్తూ వస్తున్నానని, పార్టీ తనకెలాంటి పదవిని ఇస్తుందో వేచి చూస్తానని అన్నారు.

 'కేపీసీసీ'పై డీకె కన్ను..:

'కేపీసీసీ'పై డీకె కన్ను..:

'ఎనిమిదిన్నదర సంవత్సరాలుగా ఆయన ఆ పదవిలో కూర్చున్నారు. చాలాసార్లు తప్పుకుంటానని చెప్పి కూడా కొనసాగారు. చాలామంది ఆ పదవి కోసం ఎదురుచూస్తున్నా.. ఆయన మాత్రం తప్పుకోలేదు' పరోక్షంగా పరమేశ్వరను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

కాగా, కేపీసీసీ చీఫ్ పరమేశ్వర కుమారస్వామి కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడంతో.. ఖాళీ అయిన పోస్టును డీకె దక్కించుకోవాలనుకుంటున్నారు. కేపీసీసీ చీఫ్ పదవి కోసం ఇప్పటికే అధిష్టానం వద్ద గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

నా జోక్యం లేదు: దేవెగౌడ

నా జోక్యం లేదు: దేవెగౌడ

కాంగ్రెస్ నేత డీకె శివకుమార్ ను కేబినెట్ లోకి తీసుకోవాలన్న ప్రతిపాదనను తాను వ్యతిరేకించినట్టు జరుగుతున్న ప్రచారాన్ని జేడీఎస్ అధ్యక్షుడు హెచ్.డి దేవెగౌడ ఖండించారు. వాళ్ల పార్టీ తరుపున డిప్యూటీ సీఎం ఎవరికి ఇవ్వాలన్నది కాంగ్రెస్ నిర్ణయం అని, దాన్ని మేమెలా నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు.

'డీకె శికుమార్ ను కేబినెట్ లోకి తీసుకోవడాన్ని నేను వ్యతిరేకించినట్టు వార్తలు వస్తున్నాయి. నేను దీనిపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. డిప్యూటీ సీఎం విషయాన్ని కాంగ్రెస్ పార్టీకే వదిలేశాం. అలాంటప్పుడు నేనెందుకు జోక్యం చేసుకుంటా?' అని దేవెగౌడ అన్నారు.

పరమేశ్వరనే వరించిన 'డిప్యూటీ సీఎం':

పరమేశ్వరనే వరించిన 'డిప్యూటీ సీఎం':


ఐదేళ్ల పాటు ప్రభుత్వం సక్రమంగా నడవాలన్నదే తన కోరిక అని, అంతకుమించి ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయంలోనూ తాను జోక్యం చేసుకోబోనని దేవెగౌడ స్పష్టం చేశారు. కాగా, దళితున్ని ఉపముఖ్యమంత్రి చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పరమేశ్వరకు అవకాశం కల్పించింది.

అదే సమయంలో సీఎం పోస్టు వక్కలిగ సామాజిక వర్గానికి చెందిన కుమారస్వామి చేపట్టారు కాబట్టి.. డిప్యూటీ సీఎం పదవిని లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన నేతకు కట్టబెట్టాలని ఉత్తర కర్ణాటక నుంచి డిమాండ్ వినిపించింది. మొత్తం మీద పదవి మాత్రం పరమేశ్వరనే వరించిన సంగతి తెలిసిందే.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
Mr Shivakumar would not only bankroll the 2019 Parliamentary elections in Karnataka, but also work hard to get more seats for the party. Though party leaders have not discussed the KPCC chief post, Mr Shivakumar seems to be pitching hard for it.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more