DK Shivkumar: నేను హిందువుగానే పుట్టాను.. హిందువుగానే చనిపోతాను..

DK Shivkumar: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇటీవల తమిళనాడులో ఈశా యోగా కేంద్రంలో సద్గురు జగ్గీ వాసుదేవ్ తో కలిసి మహాశివరాత్రి వేడుకల్లో వేదికను పంచుకోవడం కాంగ్రెస్ లో కలకలం రేపుతుంది. కర్ణాటక సహకారమ మంత్రి కేఎన్ రాజణ్ణ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని విమర్శించిన వారితో శివకుమార్ వేదికను ఎలా పంచుకోగలరని ప్రశ్నించారు. రాహుల్ గురించి తెలియదని సద్గురు స్వయంగా చెప్పారన్నారు. రాహుల్ గాంధీ గురించి ఏం మాట్లాడారో తన కంటే శివకుమార్ కే బాగా తెలుసన్నారు. ఇప్పుడు అలాంటి వారితో వేదిక పంచుకోవడం సముచితమో కాదో వారు సమాధానం చెప్పాలన్నారు.

'పార్టీకి సమాచారం అందించారు'
ఈ వ్యవహారంపై డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ స్పందిస్తూ.. పార్టీకి సమాచారం ఇచ్చిన తర్వాతే తాను అలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. డీకే సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. శివకుమార్ ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడల్లా పార్టీ హైకమాండ్ కు ముందుగానే సమాచారం ఇచ్చారన్నారు. ఈశా ఫౌండేషన్ మహాశివరాత్రి కార్యక్రమంలో పాల్గొనడం గురించి డీకే శివకుమార్ పార్టీకి తెలియజేశారని స్పష్టం చేశారు. సద్గురు స్వయంగా ఇంటికి ఆహ్వానించడం వల్లే తమ కుటుంబం ఆ కార్యక్రమానికి హాజరైనట్లు చెప్పుకొచ్చారు. కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన డీకే శివకుమార్ బుధవారం కోయంబత్తూరులో జరిగిన మహాశివరాత్రి వేడుకలకు హాజరయ్యారు. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరయ్యారు.

DK Shivkumar Controversy Sparks Over His Participation in Isha Foundation Event

డీకే శివకుమార్ ఏం చెప్పారంటే..?
డీకే శివకుమార్ తన సందర్శనను సమర్థించుకున్నారు. తన విశ్వాసం గురించి స్పష్టంగా చెప్పారు. 'నేను హిందువుగా పుట్టాను.. హిందువుగానే మరణిస్తా' అని అన్నారు. సద్గురు కర్ణాటకకు చెందినవారని.. ఆయన కావేరీ నీటి కోసం పోరాడుతున్నారని డీకే శివకుమార్ చెప్పారు. ఆయన వచ్చిన స్వయంగా ఆహ్వానించారని డీకే వెల్లడించారు.

సద్గురు గొప్ప పని చేస్తున్నాడని.. వివిధ రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు, నాయకులు అక్కడ ఉన్నారని.. కాబట్టి తాను అక్కడికి వెళ్లానని.. ఇది నా వ్యక్తిగత నమ్మకమని శివకుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. "నా నియోజకవర్గంలో దాదాపు 100 అడుగుల ఎత్తున్న యేసుక్రీస్తు విగ్రహం ఉంది. స్థానిక నియోజకవర్గ ప్రజలే క్రీస్తు విగ్రహాన్ని నిర్మించారు. అప్పుడు బీజేపీ వాళ్లు నన్ను 'యేసుకుమార' అని పిలిచారు. నేను అన్ని మతాలను, అన్ని కులాలను నమ్ముతాను. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం సమాజంలోని ప్రతి ఒక్కరినీ కలుపుకొని వెళ్లడం.. కాబట్టి ఇది కొంతమందికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. " అని డీకే శివకుమార్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+