కావాలనే కావేరిని వదల్లేదు, కోర్టు ఆదేశాలు పాటించాము, స్వార్థం కోసం కాదు !
బెంగళూరు: కేంద్రంలో ప్రతిపక్ష పార్టీల కోసం ఏర్పాటు అయిన ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తమిళనాడుకు కావేరి నీరు విడుదల చెయ్యాలేదని, న్యాయస్థానం మీద గౌరవంతో నీటిని వదిలిపెట్టామని, కోర్టు ఆదేశాలను మేము పాటించామని, అదనంగా మా రైతుల కోసం పోరాటం చెయ్యడానికి కావేరి నీరు నిర్వహణ అథారిటీకి తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశామని కర్ణాటక ఉపముఖమంత్రి డీకే. శివకుమార్ అన్నారు.
శుక్రవారం డీకే శివకుమార్ బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. మేము కోర్టు ఆదేశాలను గౌరవించి కావేరి నీటిని విడుదల చేశామని, ఏపార్టీకి చెందిన ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా కోర్టు ఆదేశాలను పాటిస్తాయని, కావేరి నీటిని విడుదల చేసి కర్ణాటక రైతులకు మేము అన్యాయం చెయ్యలేదని, కర్ణాటక రైతులను కాపాడుకోవడం మా మీద ఉన్న పెద్ద బాధ్యత అని డీకే శివకుమార్ అన్నారు.

తమిళనాడుకు కావేరి నీరు వదిలివేయడాన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి, అది సహజం. ప్రభుత్వం ఇలాంటి సమయంలో సహనంతో పని చేయవలసి ఉందని, వర్షం తగ్గుముఖం పట్టిందని, ఇదే కారణంతో కావేరి అథారిటీకి తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేమని డీకే శివకుమార్ అన్నారు. ఇలాంటి పరిస్థితిలో జేడీఎస్, బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉంటే వాళ్లు ఏం చేసేవాళ్లు అని డీకే శివకుమార్ ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించారు.

కావేరి నీటిని తమిళనాడుకు విడుదల చేసిన విషయంలో మేము రాజకీయాలు చెయ్యాలనే ఆలోచనలో లేమని, కావేరి, మహాదాయి, కృష్ణా చర్చల్లో సర్వపక్ష సమావేశాలు ఆహ్వానించబడ్డాయని, కేంద్రంలో బలిష్ఠ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ మహాదాయి, కృష్ణ నీటి విషయంలో బీజేపీ నాయకులు కర్ణాటకకు న్యాయం చెయ్యలేకపోయారని, త్వరలో ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని, అఖిల పక్ష సమావేశంలో ఇదే విషయంలో చర్చలు జరుపుతామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు.












Click it and Unblock the Notifications