పక్క రాష్ట్రం ఓవర్ యాక్షన్ పై త్వరలో నిర్ణయం తీసుకుంటాము, కర్ణాటక డీసీఎం ఫైర్!
బెంగళూరు: కర్ణాటకలోని బెళగావి సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఆరోగ్య బీమా బెనిఫిట్ పథకాలను మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వం అందించడంపై కర్ణాటక ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని కర్ణాటక (karnataka) ఉప ముఖ్యమంత్రి డీకే (DK Sivakumar) శివకుమార్ అన్నారు. అయితే ఈ విషయంలో ఎలాంటి వివాదం సృష్టించకూడదని, వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యనని డీకే శివకుమార్ అన్నారు.
కర్ణాటక సీఎం (CM) సిద్ధరామయ్యతో ఈ విషయంపై చర్చిస్తామమని, కర్ణాటక- మహారాష్ట్ర సరిహద్దులోని బెళగావి జిల్లాలోని (Belagavi border) ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య బీమా పథకం లబ్ధి చేకూర్చేందుకు కొల్హాపూర్ జిల్లా చందగడ తాలూకాలో మహారాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయం ఇప్పుుడు మాకు తెలిసిందని, ఆ విషయంలో క్షుణ్ణంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని డీకే శివకుమార్ చెప్పారు.

బెళగావి (Belagavi border) కర్ణాటక రాష్ట్రంలో అంతర్భాగమని, బెళగావి రెండో రాజధాని అనే సందేశాన్ని అందించేందుకు ఇక్కడ మిని విధాన సౌధను నిర్మించామని డీకే శివకుమార్ గుర్తు చేశారు. బెళగావి (Belagavi border) కర్ణాటకలోనే ఉంటుందని డీకే శివకుమార్ ధీమాగా చెప్పారు. సీబీఐ తన మీద నమోదు చేసిన కేసు విషయంలో తన లాయర్లు తదుపరి చర్యలు తీసుకుంటారని, ఈ రోజు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తన లాయర్లతో చర్చించి తరువాత ఏం చెయ్యాలో ఆలోచిస్తామని డీకే శివకుమార్ (DK Sivakumar) అన్నారు.

హుక్కేరి హిరేమఠం చంద్రశేఖర శివాచార్య స్వామిజీ డీకే శివకుమార్‌కు సీఎం (CM) పదవి ఇవ్వాలని, ఆయనకు తన మద్దతు ఇస్తున్నానని ఇటీవల చెప్పారు. ఈ విషయంలో డీకే శివకుమార్ (DK Sivakumar)స్పందించారు. స్వామిజీ మద్దతివ్వడంపై మీడియా అడిగిన ప్రశ్నకు డీకే శివకుమార్ సమాధానం ఇస్తూ ఇది కాంగ్రెస్ (congress) పార్టీ హైకమాండ్‌కే వదిలేస్తున్నామని, నేను ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదని డీకే శివకుమార్ (DK Sivakumar)మాట దాటవేశారు. కర్ణాటక ప్రజలకు ఐదేళ్లు సుపరిపాలన అందించాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నదనని డీకే శివకుమార్ వివరించారు












Click it and Unblock the Notifications