సోనియా, రాహుల్‌తో స్టాలిన్ భేటీ-కీలక చర్చలు- తమిళనాడులో గెలిచాక తొలిసారి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్ కూటమి విజయం తర్వాత తొలిసారి డీఎంకే ఛీఫ్ ఎంకే స్టాలిన్, ఆయన సతీమణి దుర్గావతి స్టాలిన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని 10 జన్‌పథ్‌కు వచ్చిన స్టాలిన్ దంపతులు సోనియా, రాహుల్‌తో కాసేపు చర్చించి వెళ్లిపోయారు.
తమిళనాడు ఎన్నికల్లో యూపీఏ కూటమి తరపున పోటీ చేసిన కాంగ్రెస్-డీఎంకే ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాయి. అనంతరం తమిళనాడులోనూ ఇరుపార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. దీంతో తమిళనాడు విజయం తర్వాత తొలిసారి ఢిల్లీ వచ్చిన సీఎం స్టాలిన్ సోనియా, రాహుల్‌తో భేటీ అయ్యారు. నిన్న ప్రధాని మోడీని కలిసిన స్టాలిన్, ఇవాళ సోనియా, రాహుల్‌తో మర్యాదపూర్వకంగాభేటీ అయినట్లు తెలుస్తోంది. వీరి భేటీలో ఏం చర్చించారన్న దానిపై వివరాలు వెల్లడి కాలేదు.

తమిళనాడు ఎన్నికల్లో విజయం, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై సోనియా, రాహుల్‌తో స్టాలిన్ చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎంగా పదవి చేపట్టిన తర్వాత తన పనితీరుతో మంచి మార్కులు సంపాదించిన స్టాలిన్.. రాష్ట్రంలో యూపిఏ కూటమిని బలోపేతం చేయడంపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రభుత్వం, యూపీఏ పార్టీల మధ్య సమన్వయం వంటి అంశాలు చర్చకు వచ్చి ఉండొచ్చని తెలుస్తోంది. స్టాలిన్ దంపతులతో సమావేశంపై రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. తమిళనాడును ఓ బలమైన రాష్ట్రంగా మార్చేందుకు స్టాలిన్‌తో కలిసి పనిచేస్తామని తెలిపారు.
Recommended Video
Congress President Smt. Sonia Gandhi and I had the pleasure of meeting Tamil Nadu Chief Minister, Shri M. K. Stalin and Smt. Durgavathy Stalin earlier today.
— Rahul Gandhi (@RahulGandhi) June 18, 2021
We will keep working with the DMK to build a strong & prosperous state for the Tamil people. pic.twitter.com/ES9FylkVRh
-
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications