జయలలిత లేరు, రెండాకుల చిహ్నం మాయం: మా సత్తా చూపిస్తాం !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్ కే నగర ఉప ఎన్నికల్లో విజయం మాదే అంటూ డీఎంకే పార్టీ నాయకులు జోస్యం చెబుతున్నారు. ఆర్ కే నగర్ నియోజక వర్గం నుంచి మా పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తమిళనాడులో జరిగే అన్ని ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు నువ్వా నేనా అంటూ పోటీ పడుతుంటాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం మాయం అయ్యింది.

 DMK is still in a crisis to win the by poll in R K Nagar in a big way.

అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం మాయం కావడం, జయలలిత మరణించడంతో డీఎంకే పార్టీ అభ్యర్ధి కచ్చితంగా విజయం సాధిస్తారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అధికారంలో ఉన్న ఎడప్పాడి పళనిసామి వర్గంలోని దినకరన్ కు చెడ్డపేరు ఉండటం, ఆపార్టీ ఓట్లు మూడుముక్కలు కావడంతో కచ్చితంగా మా పార్టీ నాయకుడే విజయం సాధిస్తారని డీఎంకే నాయకులు అంటున్నారు.

మొత్తం మీద జయలలిత మరణించడం, అన్నాడీఎంకే పార్టీ రెండాకుల గుర్తు మాయం కావడంతో డీఎంకే పార్టీకి కలసి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా ఆర్ కే నగర్ లో డీఎంకే పార్టీ విజయం సాధిస్తే జయలలిత కంచుకోట బద్దలు అవుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There is no ADMK, there is no Jayalalitha, there is no Two leaves symboly. Yet, DMK is still in a crisis to win the by poll in R K Nagar in a big way.
Please Wait while comments are loading...