రాజకీయ నేతలకు గుణపాఠం: శశికళపై స్టాలిన్, స్వీట్లు పంచారు
జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు తీర్పు పైన డీఎంకే అధినేత, ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ స్పందించారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందన్నారు. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
చెన్నై: జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు తీర్పు పైన డీఎంకే అధినేత, ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ స్పందించారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందన్నారు. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
కర్ణాటక హైకోర్టు తీర్పును కొట్టివేసిన సుప్రీంకోర్టు జయలలితతో పాటు సహ నిందితులుగా ఉన్న శశికళ, ఇళవరసి, సుధాకరన్‌కు నాలుగేళ్ల పాటు జైలుశిక్ష, భారీ జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో స్టాలిన్ మీడియాతో మాట్లాడారు.

సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును ఆహ్వానిస్తున్నామని, ఈ పరిస్థితుల్లో సుస్థిర పాలన ఏర్పాటకు గవర్నర్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ నాయకులకు ఈ తీర్పు ఓ గుణపాఠం అన్నారు. ఇరవై ఒక్క ఏళ్ల తర్వాత ఈ తీర్పు శుభపరిణామం అన్నారు.
కాగా, సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తర్వాత స్టాలిన్ నివాసం వద్ద డీఎంకే కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. డీఎంకే కార్యాలయం వద్ద కూడా సంబరాలు జరుపుకున్నారు. ఆనందోత్సాహాలతో మిఠాయిలు పంచుకున్నారు.












Click it and Unblock the Notifications