స్టాలిన్ అభిమాని ఆత్మహత్య: ఆరాధ్య నేతకు అలా జరిగిందని తెలిసి..

స్టాలిన్ పై దాడి జరిగిందన్న వార్తల నేపథ్యంలో కడలూరు జిల్లా ముదునగర్ లోని చోనాత్తుచావిడి 9వ వార్డుకు చెందిన డీఎంకే కార్యదర్శి వడివేలు(45) బలవన్మరణానికి పాల్పడ్డాడు.

చెన్నై: తమిళుల్లో వ్యక్తి పూజ ఎంతగా పాతుకుపోయిందో అందరికీ తెలిసిందే. ఆరాధ్య నేతల కోసం అభిమానులు కొన్నిసార్లు ప్రాణాలు తీసుకోవడానికైనా వెనుకాడరు. తాజాగా తమిళనాడులోని కడలూరు జిల్లా ముదునగర్ లోను ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

అసెంబ్లీలో బలపరీక్ష సందర్బంగా మార్షల్స్ స్టాలిన్ పై దాడి చేశారన్న వార్తలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన అభిమాని ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడలూరు జిల్లా ముదునగర్ లోని చోనాత్తుచావిడి 9వ వార్డుకు చెందిన డీఎంకే కార్యదర్శి వడివేలు(45) ఈ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Dmk member committs suicide after attack on stalin in assembly

స్టాలిన్ ను విపరీతంగా అభిమానించే వడివేలు ఆయనపై దాడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

కాగా, మార్షల్స్ తనపై దాడి చేశారంటూ డీఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ బలపరీక్ష సందర్బంగా సభ బయట హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. చిరిగిన చొక్కాతో ఆయన సభ బయటకు వచ్చిన దృశ్యాలు మీడియాలో పదేపదే ప్రసారమయ్యాయి. దీంతో స్టాలిన్ పై దాడికి తీవ్ర మనస్తాపానికి గురైన వడివేలు ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

విషయం తెలుసుకున్న డీఎంకె వర్గాలు వడివేలు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని ఓదార్చాయి. స్టాలిన్ సతీమణి దుర్గా వడివేలు కుటుంబ సభ్యులను ఓదార్చి, వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కొంత ఆర్థిక సహాయాన్ని కూడా బాధితుడి కుటుంబానికి అందజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+