Birthday: అధికార పార్టీ లీడర్ భార్య ఆత్మహత్య, పుట్టిన రోజు నాడే పాపం, లవ్ మ్యారేజ్, గొడవలు !
చెన్నై: అధికారంలో పార్టీకి ఓ తలనొప్పి వచ్చిపడింది. అధికార పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడి భార్య ఆమె పుట్టిన రోజు నాడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. బర్త్ డే రోజు భార్య ఆత్మహత్య చేసుకోవడంతో అధికార పార్టీ జాయింట్ సెక్రటరీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. బర్త్ డే గ్రాండ్ గా జరుపుకునే విషయంలో గొడవ జరిగి తన భార్య ఆత్మహత్య చేసుకుందని పోలిటికల్ లీడర్ అంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తమ అమ్మాయిని టార్చర్ పెట్టడం వలనే ఆమె ఆత్మహత్య చేసుకుందని భార్య కుటుంబ సభ్యులు కేసు పెట్టారు.

పొలిటిక్ లీడర్ లవ్ మ్యారేజ్
తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ కమ్యునికేషన్ విభాగం జాయింట్ సెక్రటరీగా పని చేస్తున్న తమిళన్ ప్రసన్న అలియాస్ ప్రసన్న నదియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రసన్న, నదియాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. డీఎంకే పార్టీలో చురుకుగా ఉన్న ప్రసన్న అనేక టీవీ చానల్స్ లో జరుగుతున్న డిబెట్లలో పాల్టొని ప్రతిపక్ష పార్టీల నాయకులను విమర్శిస్తు సొంత పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.

భార్త బర్త్ డే రోజు గొడవ
మంగళవారం (జూన్ 8వ తేది) ప్రసన్న భార్య నదియా పుట్టిన రోజు, తన బర్త్ డే గ్రాండ్ గా నిర్వహించాలని నదియా భర్త ప్రసన్నను కోరిందని తెలిసింది ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అమలులో ఉందని, ఈ రోజు బర్త్ డే నిర్వహించడం సాధ్యం కాదని ప్రసన్న ఆయన భార్య నదియాకు చెప్పాడని తెలిసింది.

ఉరి వేసుకుని ఆత్మహత్య
తన బర్త్ డే ఎందుకు చెయ్యవని భర్త ప్రసన్నతో నదియా తీవ్రస్థాయిలో గొడవ పడిందని తెలిసింది. తరువాత భర్త ప్రసన్న బయటకు వెళ్లిన తరువాత నదియా చెన్నైలోని ఎరుక్కంచెరీలోని ఇందిరానగర్ వెస్ట్ విభాగంలోని ఆమె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.

నిత్యం గొడవలు జరుగుతున్నాయి ?
కొంతకాలం నుంచి నిత్యం ప్రసన్న తమ కుమార్తె నదియాతో గొడవలు పడుతూనే ఉన్నాడని, అతని వేధింపుల కారణంగానే నదియా ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రసన్నను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని. కేసు దర్యాప్తులో ఉందని చెన్నై సిటీ పోలీసులు తెలిపారు. ప్రసన్న భార్య నదియా ఆత్మహత్య చేసుకోవడం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications