సంచలనం: తమిళనాడులో డిఎంకె పాలన, పన్నీర్ కు అందుకేనా?
డిఎంకె పాలన త్వరలోనే తమిళనాడు రాష్ట్రంలో రానుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ చెప్పారు.ఈ మేరకు ఆయన పార్టీ కార్యకర్తలకు బహిరంగ లేఖ రాశాడు.అన్నాడిఎంకె లోని రెండు వర్గాలు పోటీలు పడి పాలనను
చెన్నై:త్వరలోనే తమిళనాడు రాష్ట్రంలో డిఎంకె అధికారంలోకి రాబోతోందని డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్అభిప్రాయపడ్డారు.అన్నాడిఎంకె పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో స్టాలిన్ వ్యాఖ్యలు సంచలనం కల్గిస్తున్నాయి.
డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఆ పార్టీ కార్యకర్తలకు లేఖ రాశాడు. ఈ లేఖలో త్వరలోనే తమిళనాడు రాష్ట్రంలోనే డిఎంకె పాలన రాబోతోందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో పరిపాలన స్థంబించిందని, అధికారం కోసం పార్టీ నాయకులు కుమ్ములాడుకొంటున్నారని ఆయన విమర్శించారు.

సామాన్యులకు భద్రత కరువైందన్నారు. నేరాలు అధికమయ్యాయని ఆయన చెప్పారు.అరియలూరులో నందిని అనే బాలికపై అత్యాచారం జరిపి హత్య చేయడం సభ్యసమాజం తలదించుకొనేలా ఉందన్నారు.
అధికారపక్షంలో రెండు వర్గాలలో ఎవరి మాట వినాలో తెలియక పోలీసులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారని ఈ పరిస్థితుల్లో డిఎంకె మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకొంటున్నారని చెప్పారు.
ఇదిలా ఉంటే పన్నీర్ సెల్వానికి డిఎంకె మద్దతివ్వాలని నిర్ణయించుకోవడం వెనుక ఉద్దేశ్యం కూడ ఇదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.శశికళకు చెక్ పెట్టడంతో పాటు పన్నీర్ సెల్వాన్ని రాజకీయంగా సులభంగా ఎదుర్కోవచ్చనే అభిప్రాయాన్ని డిఎంకె నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications