Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీ చిత్తుగా ఓడిపోతుంది, కురుణానిధి కొడుకు సంచలన వ్యాఖ్యలు!

చెన్నై: తమిళనాడులో రానున్న లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీ అతి దారుణంగా ఓటమిపాలౌతుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి కుమారుడు ఎంకే. అళగిరి జోస్యం చెప్పారు. గత లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి ఎలాంటి అనుభవం ఎదురౌయ్యిందో అదే పరిస్థితి ఇప్పుడు ఎదురౌతుందని ఎంకే. అళగిరి అన్నారు.

కేంద్ర మాజీ మంత్రి అయిన ఎంకే. అళగిరి మీడియాతో మాట్లాుడుతూ 2014 లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీ చితకలపడిందని గుర్తు చేశారు. డీఎంకే పార్టీ ప్రత్యర్థి ఏఐఏడీఎంకే 39 లోక్ సభ స్థానాల్లోకి 37 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించి తిరుగులేని పార్టీగా అవతరించిందని ఎంకే. అళగిరి అన్నారు.

2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే డీఎంకే పార్టీ అభ్యర్థుల అసలు బండారం బయటపడుతుందని ఎంకే. అళగిరి చెప్పారు. మధురైలోని సీపీఎం అభ్యర్థి ఎస్. వెంకటేశన్ తో భేటీ అయిన విషయంపై ఎంకే. అళగిరి క్లారిటీ ఇచ్చారు.

DMK would face the same fate in the coming Lok Sabha elections says MK Alagiri

మర్వాదపూర్వకంగా తాను సీపీఎం అభ్యర్థి ఎస్. వెంకటేశన్ భేటీ అవుతున్నామని, ఆయన తన సహాయం కోరితే తప్పుకుండా గౌరవంతో పని చేస్తానని ఎంకే. అళగిరి అన్నారు. తమిళనాడులో ప్రత్యర్థుల దెబ్బకు డీఎంకే పార్టీ దిమ్మతిరుగుతుందని, అందులో ఎలాంటి సందేహం లేదని ఎంకే. అళగిరి అన్నారు. కరుణానిధి ఉన్న సమయంలోనే డీఎంకే పార్టీ నుంచి అళగిరిని బహిష్కరించారు.

కరుణానిధి మరణించిన తరువాత ఆయన కుమారుడు, తమిళనాడు ప్రతిపక్షనాయకుడు ఎంకే. స్టాలిన్ డీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టారు. డీఎంకే పార్టీలోకి వెళ్లాలని తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేసి విఫలమం అయిన అళగిరి చివరికి చెన్నైలో భారీ ర్యాలి నిర్వహించి శక్తి ప్రదర్శన చేశారు.

దక్షిణ తమిళనాడులో దివంగత నేత ఎం. కరుణానిధి కుమారుడు ఎంకే. అళగిరికి మంచిపట్టు ఉంది. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే బీజేపీతో పొత్తుకుని లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. ఇక డీఎంకే పార్టీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుని లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+