వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ అనారోగ్య సమస్యలు ఉంటే కోవాక్సిన్ తీసుకోకండి .. భారత్ బయోటెక్ హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతుంది. భారతదేశంలో అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతించిన రెండు వ్యాక్సిన్లలో ఒకటి కోవాక్సిన్ . కోవాక్సిన్ విషయంలో మాత్రం టీకా తీసుకున్నవారు సమ్మతి పత్రంపై సంతకం చేసి షరతులు అంగీకరించాలి. ఇప్పటి వరకు టీకాలు తీసుకున్న వారిలో భారత్ బయోటెక్ కు సంబంధించిన కోవాక్సిన్ టీకాకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి . దీంతో భారత్ బయోటెక్ ఒక ఫ్యాక్ట్ షీట్ రిలీజ్ చేసింది.

Recommended Video

అలాంటి లక్షణాలు ఉన్నవారు వాక్సిన్ తీసుకోకపోవడమే మంచిది-భారత్ బయోటెక్

కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక వార్డ్ బాయ్ మృతి .. టీకాతో సంబంధం లేదన్న ఆస్పత్రి అధికారి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక వార్డ్ బాయ్ మృతి .. టీకాతో సంబంధం లేదన్న ఆస్పత్రి అధికారి

 రోగనిరోధక శక్తిని ప్రభావితం చేసే మందులు వాడుతుంటే టీకా తీసుకోకూడదు

రోగనిరోధక శక్తిని ప్రభావితం చేసే మందులు వాడుతుంటే టీకా తీసుకోకూడదు


రోగనిరోధక శక్తి లేనివారు లేదా వారి రోగనిరోధక శక్తిని ప్రభావితం చేసే మందులు వాడుతున్నవారు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కోవాక్సిన్ తీసుకోకూడదని కోవాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ ఒక ఫాక్స్‌షీట్ ద్వారా సలహా ఇచ్చింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా టీకాలు తీసుకున్న వారిలో చాలా మందికి తీవ్రమైన ప్రతికూల ప్రభావం కనిపిస్తున్న కారణంగా భారత్ బయోటెక్ తమ టీకాలు తీసుకునే వారి విషయంలో అనారోగ్య సమస్యలు ఉన్నవారికి సూచనలు చేసింది.

వ్యాక్సిన్ ఇచ్చే వైద్యాదికారికి ఇతర అనారోగ్య సమస్యల గురించి చెప్పాలన్న భారత్ బయోటెక్

వ్యాక్సిన్ ఇచ్చే వైద్యాదికారికి ఇతర అనారోగ్య సమస్యల గురించి చెప్పాలన్న భారత్ బయోటెక్


వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొనేవారు తమకు వ్యాక్సిన్ ఇస్తున్న అధికారికి ఏవైనా అలెర్జీలు లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఇతర సమస్యలు ఉంటే బహిర్గతం చేయాలని ,వాటిని చెప్పిన తర్వాతే అతనికి వ్యాక్సిన్ ఇవ్వాలా వద్దా అన్న అంశాన్ని వైద్యులు నిర్ణయించి వ్యాక్సిన్ ఇస్తారని పేర్కొన్నారు.

కోవాక్సిన్ తీసుకున్న వారు చాలా మంది అనారోగ్యం బారిన పడడంతో భారత్ బయోటెక్ ఒక ప్రకటనలో ఇతరత్రా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్న వారు కోవాక్సిన్ టీకా తీసుకోవద్దని సలహా ఇస్తున్నారు .

అలెర్జీ చరిత్ర ఉన్నవారు , ఈ లక్షణాలు ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోకూడదు

అలెర్జీ చరిత్ర ఉన్నవారు , ఈ లక్షణాలు ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోకూడదు

అలెర్జీ చరిత్ర ఉన్నవారు, జ్వరం ఉన్నవారు, రక్తస్రావం ఉన్నవారు లేదా రక్తం తక్కువగా ఉన్నవారు, రోగనిరోధక శక్తి లేనివారు లేదా రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేసే మందులు వాడుతున్నవారు, గర్భవతులు, తల్లి పాలివ్వడం లేదా మరొక కోవిడ్-19 వ్యాక్సిన్ ను తీసుకున్నవారు కోవాక్సిన్ వ్యాక్సిన్ ను తీసుకోకూడదని వెల్లడించారు.
కోవిడ్-19 టీకా డ్రైవ్ ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా నివేదించబడిన ప్రతికూల సంఘటనల దృష్ట్యా భారత్ బయోటెక్ విడుదల చేసి ఉండవచ్చని ఫ్యాక్ట్‌షీట్‌పై స్పందిస్తూ ఆరోగ్య నిపుణులు తెలిపారు.

వ్యాక్సిన్ తీసుకుంటే వచ్చే రియాక్షన్స్ ఇవే

వ్యాక్సిన్ తీసుకుంటే వచ్చే రియాక్షన్స్ ఇవే

కోవాక్సిన్ తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్యకు కారణమయ్యే అవకాశం ఉందని, కానీ చాలా అరుదుగా సంభవించవచ్చని భారత్ బయోటెక్ తన ఫాక్ట్ షీట్ లో పేర్కొంది. తీవ్రమైన అలెర్జీ రియాక్షన్ గా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అంతేకాదు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొందరికి వచ్చే రియాక్షన్ సంకేతాలలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముఖం మరియు గొంతు వాపు, వేగంగా హృదయ స్పందన, శరీరమంతా దద్దుర్లు, మైకము మరియు బలహీనత ఉంటాయని పేర్కొంది.

English summary
Bharat Biotech said people with a history of allergies, have a fever, have a bleeding disorder or are on a blood thinner, are immuno-compromised or on medication that affects the immune system, are pregnant, are breastfeeding or have received another COVID-19 vaccine should not take the Covaxin jab.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X