Govt: ఆంధ్రా, తెలంగాణతో పొల్చుకుంటే కర్ణాటక ప్రభుత్వానికి ఎన్నిలక్ష్లల కోట్లు అప్పుల్లో తేడా ఉంది ?, లెక్క!

కర్ణాటక రాష్ట్రం ఎన్ని లక్షల కోట్ల అప్పుల్లో ఉందనే విషయంలో క్లారిటీ వచ్చింది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాస్ట్రాల అప్పులతో పోల్చడానికి కర్ణాటకలోని కొందరు నాయకులు సిద్దం అవుతున్నారు.

బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఆ రాష్ట్ర ఆర్థిక శాఖను కూడా చూసుకుంటున్నారు. సీఎం బసవరాజ్ బోమ్మయ్ శుక్రవారం విధాన సౌధలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వానికి ఇది ఆఖరి బడ్జెట్. ఎందుకంటే అతి త్వరలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నిలు జరగనున్నాయి. సీఎం బసవరాజ్ బోమ్మయ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. కర్ణాటకను బీజేపీ నాయకులు అప్పుల్లో ముంచేశారని, ఇది ఎన్నికల బడ్జెట్ అని, సామాన్య ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ కాదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం ఎన్ని లక్షల కోట్ల అప్పుల్లో ఉందనే విషయంలో ఓ రకంగా కొంచెం క్లారిటీ కూడా వచ్చింది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాస్ట్రాల అప్పులతో పోల్చడానికి కర్ణాటకలోని కొందరు నాయకులు సిద్దం అవుతున్నారు.

కర్ణాటక అప్పులు ఎంతో తెలుసా ?

కర్ణాటక అప్పులు ఎంతో తెలుసా ?

కర్ణాటక ముఖ్యంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ శుక్రవారం విధాన సౌధలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.3, 09, 187 కోట్లు బడ్జెట్ కేటాయించారు. గత నాలుగేళ్లలో బీజేపీ ప్రభుత్వం రూ. 2, 54, 760 కోట్ల రుణం తీసుకుందని, కర్ణాటక రాష్ట్రం ఇప్పటి వరకు మొత్తం రూ.5, 64 ,896 కోట్లు రుణం తీసుకుందని. రాష్ట్ర ప్రజలను అప్పులపాలు చేశారని కర్ణాటకలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య ఆరోపించారు..

బీజేపీ ఎన్నికల బడ్జెట్

బీజేపీ ఎన్నికల బడ్జెట్

విధాన సౌధలో సీఎం బసవరాజ్ బోమ్మయ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత మాజీ సీఎం సిద్దరామయ్య

మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ తో పాటు బీజేపీ ప్రభుత్వవ మీద దుమ్మెత్తిపోయారు. సీఎం బసవరాజ్ బోమ్మయ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ బీజేపీ ప్రభుత్వం ఎన్నికల బడ్జెట్ అని మాజీ సీఎం సిద్దరామయ్య విమర్శించారు. కర్ణాటకలో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని, ఇది బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే బడ్జెట్ అని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు.

సిగ్గులేని ప్రభుత్వం

సిగ్గులేని ప్రభుత్వం

కర్ణాటక ప్రభుత్వం రూ.3, 09,187 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది. గత బడ్జెట్‌లో 206 కార్యక్రమాలను ప్రకటించారని, అందులో 56 కార్యక్రమాలు కూడా అమలు కాలేదని సిద్దరామయ్య ఆరోపించారు. బీజేపీ నాయకులు ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో 600 హామీలు ఇచ్చారు. అందులో కనీసం 90% హామీలు కూడా ఈ బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదని మాజీ సీఎం సిద్దరామయ్య విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చివరి బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పుడు ఐదేళ్లు మేము ఏం చేశామో ప్రజలకు చెప్పాను. అయితే వీళ్లు ఏం చేశారో ప్రజలకు చెప్పడానికి సిద్దంగా లేరని, వీళ్ల చేతకాని ప్రభుత్వానికి ఇది నిదర్శనం అని సిద్దరామయ్య మండిపడ్డారు.

ప్రజలను ముంచేశారు. కర్ణాటక అప్పులు ఎంతంటే ?

ప్రజలను ముంచేశారు. కర్ణాటక అప్పులు ఎంతంటే ?

నాలుగేళ్లలో రూ. 2. 47 లక్షల కోట్లు. అప్పు తెచ్చుకున్న బీజీపీ ప్రభుత్వం కర్ణాటక ప్రజలను నిలువునా ముంచేశారని సిద్దరామయ్య ఆరోపించారు. ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తం అప్పుల లెక్కలు రూ. 5, 64, 896 కోట్లు ఉంటుందని కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ అంటున్నారని సిద్దరామయ్య గుర్తు చేశారు. తాను సీఎంగా దిగిపోయే సమయంలో కర్ణాటక అప్పులు రూ. 2, 47, 000 కోట్లు ఉందని, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వ హయాంలో రూ. 41, 914 కోట్ల రుణాలు తీసుకున్నామని సిద్దరామయ్య గుర్తు చేశారు.

చేతకాని ప్రభుత్వం ఇలాగే చేస్తోంది

చేతకాని ప్రభుత్వం ఇలాగే చేస్తోంది

సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయిన తరువాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్లలో రూ. 2, 54, 760 కోట్లు అప్పు చేసిందని, మేము (కాంగ్రెస్) ఐదేళ్ల పాలనలో కేవలం రూ. 1,16,512 కోట్లు మాత్రమే అప్పుగా తీసుకున్నామని సిద్దరామయ్య గుర్తు చేశారు. అయితే కేవలం నాలుగేళ్లలో రూ. 2,54,760 కోట్లు అప్పుగా తీసుకున్న బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని, రూ. 34 వేల కోట్ల వార్షిక వడ్డీ చెల్లించాలని, కర్ణాటకను, ఈ రాష్ట్ర ప్రజలను బీజేపీ నాయకులు అప్పులపాలు చేశారని మాజీ సీఎం సిద్దరామయ్య మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+