ఢిల్లీ బ్లాస్ట్ మాస్టర్‌మైండ్‌తో డాక్టర్ షహీన్-మాజీ భర్త సంచలన వాంగ్మూలం..!!
ఢిల్లీలో కారు బాంబు పేలుడు తర్వాత పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనతో సంబంధమున్న పలువురిని ఇప్పటికే విచారణా సంస్థలు అరెస్టు చేశాయి. ముఖ్యంగా వైట్ కాలర్ జాబ్స్ ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలను నడుపుతున్న వారిని విచారణ సంస్థలు గుర్తించాయి.పాకిస్తాన్ గడ్డ పై నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను నడుపుతోన్న జైషే మొహ్మద్ ఉగ్రవాద సంస్థతో సత్సంబంధాలున్నట్లు పేర్కొంటూ షహీన్ సయీద్ అనే మహిళా డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈమె గురించి పలు ఆసక్తికర విషయాలను ఆమె మాజీ భర్త డాక్టర్ జాఫర్ హయత్ వెల్లడించారు. ఆయన ప్రస్తుతం కాన్‌పూర్‌లోని ఓ హాస్పిటల్‌లో కంటి డాక్టర్‌గా పనిచేస్తున్నారు.
విలాసవంతమైన జీవితం కోరుకునేది
ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ షహీన్ సయీద్ మాజీ భర్త డాక్టర్ జాఫర్‌ను పోలీసులు విచారణ చేశారు. తనతో కలిసి ఉన్నప్పుడు మంచి విలాసవంతమైన జీవనం గడిపేందుకు ఆస్ట్రేలియా లేదా యూరప్ దేశాలకు వెళ్లి సెటిల్ అవుదామని ఒత్తిడి చేసేదని డాక్టర్ జాఫర్ హయత్ తెలిపాడు. అయితే భారత్‌ను వదిలి ఎక్కడికి వెళ్లేది లేదని తాను వారించినట్లు వివరించాడు. తాము కలిసి ఉండగా ఎప్పుడూ తనలో మరోరకమైన ఆలోచనలు చూడలేదని చెప్పారు. 2013లో వారిద్దరూ ఏకాభిప్రాయం మీద విడాకులు తీసుకున్నట్లు డాక్టర్ హయత్ వివరించారు. వారికి ఇద్దరు పిల్లలు ఉండగా.. వారిని తనకే అప్పజెప్పి వెళ్లిపోయినట్లు స్పష్టం చేశారు.

డాక్టర్ జాఫర్‌తోనే పిల్లలుండగా.. షహీన్‌ను వారు కలవక చాలా కాలం అవుతోంది. షహీన్ ఇలాంటి ఉగ్రవాద సంస్థలతో జతకడుతుందని తానెప్పుడూ ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాన్‌పూర్ మెడికల్ కాలేజీలో ఫార్మకాలజీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న సమయంలో ఏదో సాధించాలనే తపన, మంచి విలాసవంతమైన జీవితం గడపాలనే లక్ష్యంగా పనిచేసేదని డాక్టర్ జాఫర్ చెప్పుకొచ్చాడు.విడాకుల తర్వాత ఆమెతో ఎప్పుడూ కలిసిందిగానీ, మాట్లాడిందిగానీ లేదని వెల్లడించాడు.
ఇదిలా ఉంటే ఢిల్లీలో కారు బాంబు పేలుడుకు కొన్ని గంటల ముందే జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఫరీదాబాద్‌లో షహీన్‌ను అరెస్టు చేశారు. ఆమె కారులో ఏకే 47 తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. దేశంలో జైషే మొహ్మద్ మహిళా వింగ్ ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తోన్న షహీన్ ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ సోదరి నేతృత్వంలో పనిచేస్తోంది. షహీన్‌తో పాటు పోలీసులు ఆమె సోదరుడు డాక్టర్ పర్వేజ్ అన్సారీని కూడా కస్టడీలోకి తీసుకున్నారు.
ప్రాథమిక విచారణలో భాగంగా లక్నోలోని కాంధారీ బజార్‌లో ఉన్న వారి ఇంట్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదని పోలీసులు వెల్లడించారు. షహీన్ తండ్రి,మరో సోదరుడిని పోలీసులు ఎంక్వైరీ చేశారు. వారి కార్యకాలాపాల గురించి ఆరా తీయడంతో పాటు ఆమె సన్నిహితులు, స్నేహితులను కూడా విచారణ చేశారు. ఫరీదాబాద్‌లోని అల్-ఫల్హా స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు రీసెర్చ్ సెంటర్‌లో డాక్టర్ షహీన్‌తో పాటు మరో ఇద్దరు డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనాయ్, డాక్టర్ ఉమర్ నబిలు పనిచేస్తున్నారు. వీరిలో డాక్టర్ ఉమర్ నబి ఢిల్లీ బ్లాస్ట్ ప్లాన్ చేసి తాను చనిపోయాడు.












Click it and Unblock the Notifications