తొలిసారి: ఒకేసారి గుండె, కాలేయం మార్పిడి

చెన్నై: తమిళనాడుకు చెందిన ఓ యువకుడికి ఏకకాలంలో గుండె, కాలేయ మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు చెన్నైలోని అపోలో ఆస్పత్రి వైద్యులు. నామక్కల్‌ జిల్లా తిరుచెంగోడు ప్రాంతానికి చెందిన ఇంజినీరింగ్‌ పీజీ పూర్తిచేసిన పొన్నర్‌(30)కు 22 ఏళ్ల వయసప్పుడే దిగువ ఉదరభాగాన వాపు, శ్వాస సంబంధిత సమస్య తలెత్తింది.

Doctors Perform Combined Heart and Liver Surgery

కాలేయం దెబ్బతినడం వల్లే సమస్య వచ్చినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. పుట్టుకతోనే హృద్రోగ సమస్య కూడా ఉన్నట్లు వెల్లడైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.

పొన్నర్‌కు 'ఎన్‌బ్లాక్‌తో కూడిన గుండె, కాలేయం అవయవాల మార్పిడి' (సీహెచ్‌ఎల్‌టీ) శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. బ్రెయిన్‌డెడ్ అయిన ఓ వ్యక్తి గుండె, కాలేయం పొన్నర్‌కు సరిపోవడంతో అక్టోబరు 14న అవయవాల మార్పిడి ప్రక్రియను విజయవంతంగా చేపట్టారు.

Doctors Perform Combined Heart and Liver Surgery

శుక్రవారం అపోలో ఆస్పత్రుల గ్రూపు ఛైర్మన్‌ ప్రతాప్‌ సి.రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ తరహా మార్పిడి ఆసియాలో ఇదే తొలిసారని అన్నారు. గుండె, కాలేయం అవయవాల మార్పిని విజయవంతంగా చేసిన వైద్యులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+