''చైనాకు శాంతి అంటే తెలియదు'', ''భయంతో జీవించకూడదు'', దలైలామా, రామ్‌దేవ్‌ల ఫన్నీ వీడియో

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: టిబెటన్ బౌద్ద గురువు దలైలామాతో, ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాల మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకొంది. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ముంబైలో ఆదివారం నాడు ప్రపంచ శాంతి, సామరస్య సమ్మేళనం జరిగింది. ఈ సమావేశంలో టిబెటన్ బౌద్ద గురువు దలైలామాతో పాటు, ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా కూడ పాల్గొన్నారు.

చైనాకు శాంతి, సామరస్యం అంటే ఏమిటో తెలియదు, ఓకవేళ తెలిస్తే దలైలామా ఇండియాలో ఆశ్రయం పొందాల్సిన అవసరం ఏముంటందన్నారు. అందుకే ఇండియా, చైనాతో కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు రామ్‌దేవ్‌బాబా.

యోగా లాంటి శాంతియుత పద్దతుల్లో నచ్చచెపితే అర్ధం చేసుకోని వాళ్ళకు యుద్దంతోనే సమాధానం చెప్పాలని రామ్‌దేవ్‌బాబా చెప్పారు.

ప్రపంచంలో అశాంతికి హింసావాదమే కారణమని భౌద్దగురువు దలైలామా అభిప్రాయపడ్డారు. భయం విసుగును పుట్టిస్తోంది. విసుగు వల్ల కోపం వస్తోంది. ఆ కోపం మనిషిని హింసవైపుకు నడిపిస్తోందన్నారు. ప్రజలంతా భయం లేకుండా జీవించాలని దలైలామా సూచించారు.

ఈ సందర్భంగా దలైలామా, యోగా గురువు రామ్‌దేవ్‌బాబా మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకొంది. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
As the standoff between India and China over Doklam continues, Baba Ramdev today said that China doesn't believe in peace and understands the language of war."China doesn't believe in peace. Had they done that Dalai Lama wouldn't be here," said Baba Ramdev at a world peace and harmony conclave in Mumbai.
Please Wait while comments are loading...