భారత్ తో దేనికైనా రెడీ, యుద్ధమైనా సరే: రెచ్చిపోయిన చైనా మీడియా
చైనా మీడియా మరోసారి భారత్ పట్ల తన దుడుకుతనాన్ని ప్రదర్శించింది. భారత్ తో ఎలాంటి ఘర్షణకైనా చైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.
న్యూఢిల్లీ: చైనా మీడియా మరోసారి భారత్ పట్ల తన దుడుకుతనాన్ని ప్రదర్శించింది. భారత్ తో ఎలాంటి ఘర్షణకైనా చైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.
సిక్కిం రాష్ట్ర సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతమైన డోక్లామ్ లో భారత బలగాలు తిష్ట వేసుకుని కూర్చోవడంపై ఇరు దేశాల మధ్య ఘర్షణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో భారత్ ను హెచ్చరిస్తూ చైనా అధికారిక వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ మంగళవారం ఒక కథనాన్ని ప్రచురించింది. భారత్ తో యుద్ధానికి కూడా చైనా భయపడబోదని, ఎంతటి తీవ్రస్థాయి ఘర్షణకైనా సిద్ధమేనని పేర్కొంది.
అంతేకాదు, ఇక భారత్ తో ఉన్న 3,488 కిలోమీటర్ల సరిహద్దు పొడువునా వివాదం మొదలవుతుందని హెచ్చరికలు చేసింది. టిబెట్ పర్వత ప్రాంతాల్లో చైనా బలగాలు సైనిక విన్యాసాలు చేస్తున్న క్రమంలో గ్లోబల్ టైమ్స్ ఇలాంటి కథనం ప్రచురించడం గమనార్హం.












Click it and Unblock the Notifications