Sonali Phogat murder సుశాంత్ హత్యలా చేయొద్దు: ఫ్యామిలీ రిక్వెస్ట్
సోనాలి ఫొగట్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. పీఏ సుధీర్‌పై సోనాలి సోదరుడు సందేహాం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె కుటుంబ సభ్యులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులా మార్చొద్దని కోరుతున్నారు. ఈ మేరకు కుల్‌దీప్ ఫొగట్ పేర్కొన్నారు. సోనాలిది హత్య అని వారు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు.

అలా చేయొద్దు..
సుశాంత్ మాత్రం హత్య అని ఇప్పటికీ వారి ఫ్యామిలీ నమ్ముతుంది. రియా చక్రవర్తి అతనికి డ్రగ్స్ ఇచ్చినా.. ఇప్పుడు ఆమె జైలు నుంచి బయటకు వచ్చింది. కేసు కొనసాగుతోంది. కేసు డ్రగ్స్ సీజ్ లేదంటే డ్రగ్స్ వినియోగం గురించి కాదని హత్య గురించి అని సోనాలి ఫ్యామిలీ అంటోంది.

ఉరితీయండి
సోనాలిని చంపిన వారిని ఉరి తీయాలని కుల్ దీప్ కోరతున్నారు. కేసు విచారణలో పోలీసులు సోనాలిది హత్య అని నిరూపించకుంటే.. సీబీఐ చేత విచారణ కోరతామని తెలిపారు. నార్కొ టెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తామని వివరించారు.

వాష్ రూమ్‌లో డ్రగ్స్
సోనాలి మృతదేహానికి గురువారం పోస్టుమార్టం నిర్వహించారు. శరీరంపై గాయాలు కనిపించాయి. ఆ రిపోర్ట్ ఆధారంగా హత్య కేసును గోవా పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో క్లబ్ యజమాని, డ్రగ్స్ వ్యాపారి సహా మరొ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. క్లబ్ వాష్ రూమ్‌లో డ్రగ్స్‌ను పోలీసులు రికవరీ చేశారు.

మత్తు కలిపి..
మూడేళ్ల క్రితం సుధీర్ ఆహారంలో మత్తు కలిపాడట. అప్పుడే సోనాలిపై లైంగికదాడి కూడా చేశాడట. దానిని వీడియో తీయడమే కాదు.. వైరల్ చేస్తామని చెప్పాడని ఆమె సోదరుడు తెలిపారు. అప్పటినుంచి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని పేర్కొన్నారు. సోనాలికి గోవా తెలియదని.. ఆమెకు ప్లీ ప్లాన్‌గా తీసుకొచ్చారని పేర్కొనారు. సినిమా షూటింగ్ 24వ తేదీన ఉంటే.. 21, 22వ తేదీన ఎందుకు బక్ చేశారని అడిగారు. అంతేకాదు. సోనాలిపై విష ప్రయోగం జరిగిందని చెప్పారు. గోవా పోలీసులు ఇప్పటికే సుధీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇంతలో ఫ్యామిలీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది.












Click it and Unblock the Notifications