వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు శుభవార్త: ట్రంప్ కొత్త విధానం ఇండియన్లకు లాభమే

మెరిట్ పద్దతి ద్వారా గ్రీన్‌కార్డులు ఇవ్వాలన్న అమెరికా నిర్ణయం ఇండియాకు చెందిన టెక్కీలకు ప్రయోజనం కలిగించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మెరిట్ పద్దతి ద్వారా గ్రీన్‌కార్డులు ఇవ్వాలన్న అమెరికా నిర్ణయం ఇండియాకు చెందిన టెక్కీలకు ప్రయోజనం కలిగించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికాకు వలస వచ్చే విదేశీయులను గణనీయంగా తగ్గించేందుకుగాను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొత్త చట్టాలను తీసుకురావాలని భావిస్తోంది.

హెచ్1 బీ వీసాలు ఇండియన్స్‌కే ఎక్కువ, పెరిగిన వేతనంహెచ్1 బీ వీసాలు ఇండియన్స్‌కే ఎక్కువ, పెరిగిన వేతనం

ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం ఉన్న వర్కర్స్‌కు మెరిట్ ఆధారిత పద్దతి ద్వారా గ్రీన్‌కార్డులు ఇవ్వాలని అమెరికా భావిస్తోంది. ఈ మేరకు ఈ కొత్త బిల్లు అమెరికా కాంగ్రెస్ ఆమోదించి చట్టరూపం దాల్చితే ఇంగ్లీష్ నైపుణ్యం ఉన్న టెక్కీలకు ప్రయోజనం కలిగే అవకాశం లేకపోలేదు.

విదేశీయులను అమెరికాకు రాకుండా ట్రంప్ సర్కార్ అనేక కొత్త విధానాలకు శ్రీకారం చుట్టింది. ఈ విధానాల కారణంగా ప్రభుత్వం కొత్త విధానాలను తీసుకు వస్తోంది.

మెరిట్ విధానం .. ఇండియన్ టెక్కీలకు లాభం

మెరిట్ విధానం .. ఇండియన్ టెక్కీలకు లాభం

అమెరికాలో శాశ్వతంగా నివాసం పొందాలనే కోరిక చాల మందికి ఉంటుంది. అయితే సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసేవారికి ఈ కోరిక ఎక్కువ. అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించక ముందు ఉన్న ఓబామా ప్రభుత్వం ఈ విషయంలో కొంత సానుకూలంగా వ్యవహరించింది. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత హెచ్ 1 బీ వీసాలపై ఆంక్షలను విధించింది. స్థానికులకే ఉద్యోగావకాశాలను కల్పించేలా నిర్ణయం తీసుకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో కొత్త విధానాన్ని తీసుకు వచ్చేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చర్యలను చేపట్టింది. మెరిట్ విధానం ద్వారా గ్రీన్‌కార్డులు ఇవ్వాలని సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు ఈ బిల్లుకు అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం తెలపాల్సి ఉంది.అయితే ఈ విధానం ఇండియన్ టెక్కీలకు ప్రయోజనం కల్గించే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Recommended Video

US President Donald Trump walks up to PM Modi for impromptu chit-chat | Oneindia Telugu
వలసలు సగానికి తగ్గిపోతాయి

వలసలు సగానికి తగ్గిపోతాయి

వలసల నివారణ కోసం అమెరికా ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువస్తోంది. ఈ బిల్లుకు అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం తెలపాల్సి ఉంది. అయతే ఎన్నికల హమీ ప్రకారంగా ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకొన్నారని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

లాటరీ వ్యవస్థకు చెక్

లాటరీ వ్యవస్థకు చెక్

అమెరికాలో గ్రీన్‌కార్డు సౌకర్యం పొందేందుకు ప్రస్తుతం లాటరీ వ్యవస్థ అమల్లో ఉంది..దీన్ని త్వరలోనే అమెరికా సర్కార్ రద్దు చేయనుంది. మెరిట్ పాయింట్ల ఆధారంగా రైస్ బిల్లును ప్రవేశపెట్టనుంది అమెరికా సర్కార్. ఇంగ్లీష్ బాష నైపుణ్యం, విద్య అధికార వేతనం గల జాబ్ ఆఫర్, వయస్సు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని అమెరికాలో ప్రవేశం కల్పిస్తారు.

వేతనాల పెంపుకు దోహదం

వేతనాల పెంపుకు దోహదం

రైస్ చట్టం పేదరికాన్ని తగ్గించి వేతనాలను పెంచుతోంది. పన్ను చెల్లింపు దారులు కోట్లాది డాలర్లను కాపాడుతోంది. విదేశీయులు అమెరికా జారీచేస్తోన్న గ్రీన్ కార్డుల విధానాన్ని మార్చడం ద్వారా ఇది సాధ్యమౌతోంది. గ్రీన్‌కార్డులు శాశ్వత నివాసాన్ని , ఉపాధి అధికారాన్ని కల్పించి త్వరగా పౌరసత్వం పొందేలా చేస్తాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ చట్టానికి ఆయన తన సంపూర్ణ మద్దతును ఇచ్చారు.

English summary
President Donald Trump announced his support for a legislation that would cut in half the number legal immigrants allowed into the US while moving to a "merit-based" system favouring English-speaking skilled workers for residency cards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X