House: రాజగోపాల్ రెడ్డి ఇంట్లో జంట హత్యలు, అర్దరాత్రి ఇంట్లో ఏం జరిగింది ? సీసీటీవీ కెమెరాల్లో ?
బెంగళూరు/తిరుపతి: ప్రముఖ వ్యాపారి ఇంట్లో ఓ వ్యక్తి 30 ఏళ్లుగా పని చేస్తున్నాడు. ఆ వ్యాపారి ఇంటికి సెక్యూరిటీ గార్డు ఉన్నారు. ఇంటి పని చెయ్యడానికి ఆడవాళ్లు ఉన్నారు. వ్యాపారి కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లాడు. అర్దరాత్రి వ్యాపారి ఇంట్లో ఆరాచకం జరిగింది. మరుసటి రోజు ఉదయం ఇంటిలో శుభ్రం చెయ్యడానికి పనిమనిషి వెళ్లింది. అంతే ఇంట్లో ఓ శవం బయటపడింది. సెక్యూరిటీ గార్డు మాయం కావడంతో అతనే హత్య చేసి ఉంటాడని అతని కోసం పోలీసులు గాలించారు. అయితే అదే వ్యాపారి ఇంట్లోని నీటి సంప్ లో సెక్యూరిటీ గార్డు శవమై కనిపించాడు. ప్రముఖ వ్యాపారి రాజగోపాల్ రెడ్డి ఇంట్లో జంట హత్యలు జరగడంతో అర్దరాత్రి అసలు ఏం జరిగింది ? అని పోలీసులు ఆరా తీశారు.

కోరమంగలలో వ్యాపారి
బెంగళూరులోని కోరమంగల రెండవ స్టేజ్ లో రాజగోపాల్ రెడ్డి అనే ప్రముఖ వ్యాపారవేత్త నివాసం ఉంటున్నారు. కర్ణాటకలోని దావణగెరెకి చెందిన కరియప్ప 30 ఏళ్ల నుంచి వ్యాపారి రాజగోపాల్ రెడ్డి ఇంటిలో పని చేస్తున్నాడు. రాజగోపాల్ రెడ్డితో పాటు ఆయన బంధువులు అందరూ కరియప్పకు బాగా పరిచయం ఉన్నారు.

సెక్యూరిటీ గార్డు
అసోంకు చెందిన బహుదూర్ (28) అనే యువకుడు రెండు సంవత్సరాల క్రితం రాజగోపాల్ రెడ్డి ఇంటిలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగంలో చేరాడు. వ్యాపారి రాజగోపాల్ రెడ్డి ఇంటిలో పని చెయ్యడానికి ఆడవాళ్లు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం వ్యాపారి రాజగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లాడు. ఇంట్లోనే ఉండాలని రాజగోపాల్ రెడ్డి కరియప్పకు చెప్పాడు.

అర్దరాత్రి అరాచకం
ఇంట్లో కరియప్ప ఉండగా ఇంటి బయట గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డు బహదూర్ ఉన్నాడు. శనివారం అర్దరాత్రి కొందరు నిందితులు గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డు బహదూర్ మీద దాడి చేసి తని నోటిలో బట్టలు కుక్కి అతని కాళ్లు చేతులు కట్టేశారు. తరువాత రాజగోపాల్ రెడ్డి ఇంటి ఆవరణంలో నీటి సంప్ లో సెక్యూరిటీ గార్డు బహదూర్ ను వేసి పై మూత మూసేశారు.

రూమ్ లోనే నరికేశారు
సెక్యూరిటీ గార్డు బహదూర్ ను నీటి సంప్ లోకి వేసిన తరువాత రాజగోపాల్ రెడ్డి ఇంట్లోకి వెళ్లిన నిందితులు రూమ్ లో నిద్రపోతున్న కరియప్ప మీద వేలకొడవళ్లు, కత్తులతో దాడి చేసి అతన్ని స్పాట్ లో చంపేశారు. మరుసటి రోజు ఉదయం ఇంటిలో శుభ్రం చెయ్యడానికి పనిమనిషి వెళ్లింది. కరియప్ప శవమై కనిపించడంతో పనిమనిషి రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేసి విషయం చెప్పింది.

అర్దరాత్రి ఏం జరిగింది ?
రాజగోపాల్ రెడ్డి ఇంటిలో కరియప్ప శవమై కనిపించడం, సెక్యూరిటీ గార్డు బహదూర్ కనపడకపోవడంతో అతనే హత్య చేసి ఉంటాడని అతని కోసం పోలీసులు గాలించారు. అయితే అదే రాజగోపాల్ రెడ్డి ఇంట్లోని నీటి సంప్ లో సెక్యూరిటీ గార్డు బహదూర్ శవమై కనిపించాడు. ప్రముఖ వ్యాపారి రాజగోపాల్ రెడ్డి ఇంట్లో రూ. 5 లక్షల నగదు, భారీ మొత్తంలో బంగారు నగలు చోరీ అయ్యాయని పోలీసుల విచారణలో వెలుగు చూసింది

పిన్ టూ పిన్ తెలిసిన వాళ్లే ?
రాజగోపాల్ రెడ్డి ఇంటిలో జరిగిన కరియప్ప, బహదూర్ జంట హత్యల వెనుక ఏం జరిగింది ? అని పోలీసులు ఆరా తీశారు. వ్యాపారి రాజగోపాల్ రెడ్డి ఫ్యామిలీ గురించి పూర్తి సమాచారం తెలిసిన వాళ్లు, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లారు అని తెలిసిన వాళ్లే కరియప్ప, బహదూర్ ను హత్య చేసి ఉంటారని డీసీపీ సీకే. బాబా అనుమానం వ్యక్తం చేశారని ప్రముఖ కన్నడ పత్రిక తెలిపింది. కోరమంగలలో ప్రముఖ వ్యాపారి రాజగోపాల్ రెడ్డి ఇంటిలో జంట హత్యలు జరగడం బెంగళూరులో కలకలం రేపింది. రాజగోపాల్ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలు పోలీసులు పరిశీలిస్తున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications