FASTag: బిగ్ అలెర్ట్.. ఫాస్టాగ్ చెల్లింపుల్లో కొత్త రూల్స్..
వాహనదారులకు బిగ్ అలెర్ట్. ఫాస్టాగ్ చెల్లింపులను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. డిజిటల్ లావాదేవీలు, టోల్ ప్లాజా వద్ద క్యాష్ వినియోగాన్ని సులభతరం చేసేందుకు పలు సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్స్ నవంబర్ 15 నుంచి అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది. సరైన ఫాస్టాగ్ లేని వాహనదారులు ఇకపై టోల్ చెల్లించాలనుకుంటే క్యాష్ రూపంలో చెల్లించాలనుకుంటే రెండింతలు కట్టాల్సి ఉంటుంది. ఇక యూపీఐ ద్వారా టోల్ చెల్లిస్తే టోల్ కాస్త తగ్గుతుంది. 1.25 రెట్లు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ విషయాన్ని తాజా రూల్స్ లో పొందుపరిచారు.
ది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్(MORTH) శాఖ జాతీయ రహదారుల ఫీజు రూల్స్, 2008 ని ఈ మేరకు సవరించాయి. ఫాస్టాగ్ లేని వాహనదారులకు వివిధ రకాలుగా ఛార్జీలను ప్రకటించింది. వారి పేమెంట్ విధానం మేరకు ఛార్జీలను సవరించింది. ఈ విధానం ప్రకారం ఉదాహరణకు.. ఫాస్టాగ్ వాహనదారుడు రూ. 100 చెల్లించాలి. ఫాస్టాగ్ లేని వాళ్లు నగదు రూపంలో అయితే.. డబుల్ ఎమౌంట్ అంటే రూ.200 చెల్లించాలి. అదే యూపీఐ ద్వారా చెల్లిస్తే మాత్రం రూ.125 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ విధానాన్ని కొత్త నిబంధనలో పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీలు, క్యాష్ వినియోగాన్ని తగ్గించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
" జాతీయ రహదారులైన ఉన్న టోల్ ప్లాజాల వద్ద డిజిటల్ పేమెంట్స్ ను సులభతరం చేయడం.. నగదు లావాదేవీలను నిర్మూలించడం కోసం కేంద్ర ప్రభుత్వం ది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్(MORTH) శాఖ జాతీయ రహదారుల ఫీజు రూల్స్, 2008 ను సవరించింది. ఈ నిబంధన ప్రకారం.. సరైన ఫాస్టాగ్ లేని వాహనదారుడు క్యాష్ రూపంలో టోల్ చెల్లించాలి అనుకుంటే డబుల్ ఎమౌంట్ కట్టాలి. యూపీఐ ద్వారా చెల్లించాల్సి వస్తే మాత్రం రూ. 125 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది"
అలాగే వాహనదారుడి ఫాస్టాగ్ లో డబ్బులు ఉండి.. అది సక్రమంగా పని చేస్తున్నా.. టోల్ వసూలు వ్యవస్థలో లోపం ఏర్పడితే.. ఫ్రీగా వెళ్లవచ్చు. వాహనదారుడు ఎలాంటి నగదు లేదా యూపీఐ ద్వారా టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ తాజా రూల్స్ నవంబర్ 15 నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్రం పేర్కొంది.

మరోవైపు దేశవ్యాప్తంగా ప్రైవేటు వాహనదారులకు నేషనల్హైవేస్ పై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వార్షిక టోల్ పాస్ ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ రూల్ ప్రకారం సంవత్సరానికి రూ.3,000 చెల్లిస్తే 200 ట్రిప్పులను వినియోగించుకోవచ్చు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications