వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరిద్దరూ గొడవపడితే ఎదుటోళ్లు బలపడుతారు: ములాయంతో లాలూ

తండ్రి-కొడుకుల ఘర్షణ ఎదుటివారికి అవకాశం ఇచ్చేదిగా తయారవుతుందని లాలూ వారితో పేర్కొనట్టు సమాచారం.

|
Google Oneindia TeluguNews

పాట్నా: తండ్రి-కొడుకులు రాజీకి రావడంతో ఎస్పీలో పుట్టిన ముసలం కొన్ని గంటల్లోనే సర్దుమణిగిన సంగతి తెలిసిందే. అంతర్గతంగా పార్టీ వ్యవహారాలు ఎలా ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి మాత్రం చీలికలు ఉండబోవన్న సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఎస్పీ రాజకీయాలపై స్పందించారు.

శనివారం నాడు ఎస్పీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌తో, ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌తో లాలూ ప్రసాద్ యాదవ్ విడివిడిగా ఫోన్లో మాట్లాడారు. యూపీ రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితిపై వారితో లాలూ చర్చించినట్టుగా తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇద్దరు కలిసి పనిచేయాలని లాలూ వారికి సూచించారు.

Downfall of Samajwadi Party will benefit BJP in UP election says lalu prasad yadav

ఆర్జేడీ కార్యాలయ సిబ్బంది ద్వారా ఈ విషయం వెల్లడైంది. తండ్రి-కొడుకుల ఘర్షణ ఎదుటివారికి అవకాశం ఇచ్చేదిగా తయారవుతుందని. తద్వారా వారు బలపడవచ్చునని లాలూ వారితో పేర్కొనట్టు సమాచారం. పార్టీని అభివృద్ధి చేసిందీ, అఖిలేశ్‌ ఓ సీఎం స్థాయికి ఎదిగేలా చేసింది మీరే కాబట్టి.. ఎస్పీ రాజకీయ వ్యవహారాలను చక్కదిద్దాల్సిన బాధ్యత కూడా మీదేనని లాలూ ములాయంతో చెప్పినట్టు తెలుస్తోంది.

అఖిలేష్ పై సస్పెన్షన్ వేటును ఎత్తివేస్తున్నట్టు ప్రకటించడం తనకు సంతోషాన్నిచ్చిందని లాలూ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో యూపీలో ఎస్పీనే అధికారంలోకి వస్తుందని లాలూ ధీమా వ్యక్తం చేశారు.

English summary
Chief Minister Akhilesh Yadav has also been removed from the party for six years. We want to save the party. My intention is not to punish anyone but a lot of effort... went into the making of this party and we must save it," Mulayam said with his brother Shivpal besides him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X